News January 26, 2026

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: వరుస సెలవుల ప్రభావంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 84,014 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 35,131 మంది తలనీలాలు సమర్పించారు. ఆలయ హుండీ ఆదాయం రూ.3.69 కోట్లుగా నమోదైంది. భక్తులు దర్శనానికి ముందుగా సరైన ప్రణాళికతో రావాలని, భద్రతా సూచనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News February 16, 2026

వరి సన్నాలు పండించిన రైతులకు బోనస్ డబ్బు విడుదల

image

TG: రాష్ట్రంలో వరి సన్నాలను పండించి, విక్రయించిన రైతులకు ప్రభుత్వం బోనస్ డబ్బును విడుదల చేసింది. వానాకాలం సీజన్‌లో సన్నాలు అమ్మిన 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో బోనస్ కింద రూ.514.36 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అదనంగా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్న బియ్యం వరి రకాలను సాగు చేసిన రైతులకు క్వింటాకు అదనంగా రూ.500 చొప్పున బోనస్ జమకానుంది.

News February 16, 2026

డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో ఉద్యోగాలు

image

న్యూఢిల్లీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 10 సైంటిస్ట్ C పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. PhD(లైఫ్ సైన్స్/ బయో టెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్/అగ్రికల్చరల్/ వెటర్నరీ సైన్సెస్), MD అర్హత గల వారు మార్చి 14వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.67,700-రూ.2,08700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.dbtindia.gov.in

News February 16, 2026

రేపే సూర్య గ్రహణం.. పండితులు ఏం చెప్పారంటే?

image

రేపటి సూర్యగ్రహణం గురించి గర్భిణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ గ్రహణం ఇండియాలో <<19151162>>కనిపించదు<<>> కాబట్టి ఇక్కడ ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన పనిలేదని సూచిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3:26 నుంచి రాత్రి 7:57 గంటల వరకు గ్రహణ సమయం ఉన్నప్పటికీ మన దగ్గర ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. గర్భిణులు ఎప్పటిలాగే తమ పనులు చేసుకోవడం, ఆహారం తీసుకోవడం చేసుకోవచ్చని చెప్పారు. share it