News April 27, 2024
అమెరికా యూనివర్సిటీ ఎన్నికల్లో అద్దంకి వాసి

అమెరికాలో యూనివర్సిటికీ సంబంధించిన ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికలలో ఏపీకి చెందిన రోహిత్ శ్రీసాయి బాచిన అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. వీరి స్వగ్రామం అద్దంకి నియోజకవర్గం జె. పంగులూరు గ్రామం. వీరి తండ్రి బాచిన హనుమంత రావు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా ఏపీ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్నారు.
Similar News
News February 23, 2026
ప్రకాశం: క్రికెట్ బెట్టింగ్.. SI పేరుతో బెదిరింపులు

ప్రకాశం(D) జరుగుమల్లి(M) చింతలపాలెంకి చెందిన శ్రీనివాసరావు, అల్లుడు హేమంత్ క్రికెట్ బుకీ నడుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనను బెట్టింగులకు అలవాటు చేసి, తనవద్ద చెక్కులు తీసుకొని నగదు అప్పు ఇచ్చి బెట్టింగులు పెట్టించారని సోమవారం జిల్లా గ్రీవెన్స్‌లో ఓ బాధితుడు వాపోయాడు. నగదుకోసం హేమంత్ సోదరుడు ఒంగోలుని ఓ రైల్వే SI పేరుచెప్పి బెదిరిస్తున్నారని, న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయాడు.
News February 23, 2026
మోటుమాల: మట్టికుప్పను ఢీకొని యువకుడి మృతి

కొత్తపట్నం మండలంలోని మోటుమాల గ్రామంలో జరిగిన ప్రమాదంలో గుండమాలకు చెందిన సురేష్ మృతి చెందారు. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా పక్కనే పోసిన మట్టికుప్పను సురేష్ తన ద్విచక్రవాహనంతో బలంగా ఢీకొట్టారు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సిబ్బంది ధ్రువీకరించారు.