News January 26, 2026

కొత్త మూవీ.. అయ్యప్పస్వామి భక్తుడిగా రవితేజ

image

మాస్ మహారాజా రవితేజ రూటు మార్చారు. అయ్యప్పస్వామి భక్తుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు. రవితేజ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్‌ను ‘ఇరుముడి’గా పేర్కొంటూ మేకర్స్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ‘ప్రతి ఎమోషన్ ఒక సెలబ్రేషన్’ అని పేర్కొన్నారు. తలపై ఇరుముడితో చిన్నారిని ఎత్తుకొని ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

Similar News

News February 15, 2026

UN రిపోర్ట్.. 3 రోజుల్లో 6,000 మంది హతం!

image

సుడాన్‌లోని డార్ఫర్‌లో గతేడాది OCTలో పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్సెస్ మారణహోమం సృష్టించాయని ఐక్యరాజ్యసమితి(UN) తాజాగా విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. RSF దాడుల్లో 3 రోజుల్లోనే (OCT 25th-27th) 6వేల మందికి పైగా మరణించారని వెల్లడించింది. RSF సైనికులు సామూహిక హత్యలు, లైంగిక హింసకు పాల్పడినట్లు తెలిపింది. సూడాన్ మిలిటరీ, RSFకి మధ్య 2023 APRలో మొదలైన ఆధిపత్య పోరు యుద్ధానికి దారితీసింది.

News February 15, 2026

లవ్లీ హోం హ్యాక్స్..

image

* చెక్క ఫర్నిచర్‌పై నీటి మరకలు అంత త్వరగా పోవు. అలాంటప్పుడు పేపర్ టవల్‌లో కొద్దిగా మయోనైజ్ రాసి అద్ది తుడిస్తే సరిపోతుంది. * చెత్త డబ్బాలు ఉంచే చోట ఆ దుర్వాసన పోవాలంటే అరకప్పు వెనిగర్ కి, అరకప్పు వంటసోడా కలిపి ఉంచాలి. * వెండి వస్తువులు ఉంచే డబ్బాలో ఓ సుద్దముక్కను కూడా ఉంచితే ఆభరణాలు నల్లబడకుండా ఉంటాయి. * వెనిల్లా పరిమళంలో ముంచిన దూదిని ఫ్రిజ్‌లో ఉంచితే అది దాంట్లోని దుర్వాసనల్ని పీల్చుకుంటుంది.

News February 15, 2026

నిర్జీవంగా వేప చెట్లు.. కారణం ఏమిటి?

image

పంటలను చీడపీడల నుంచి కాపాడే వేప చెట్లే తెగుళ్ల బారినపడటం కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల వేప చెట్ల కొమ్మలు, రెమ్మలు మాడి నిర్జీవంగా కనిపిస్తున్నాయి. ఫోమోప్సిస్ అజాడిరక్టే ఫంగస్ వల్లే ఇలా జరుగుతున్నట్లు వ్యవసాయ నిపుణులు తెలిపారు. ఇది ఒక చెట్టు నుంచి మరో చెట్టును ఆశిస్తోంది. అయితే ఇది ఏడాదిలో కొంతకాలం పాటే చెట్లకు సోకుతుందని, మళ్లీ ఈ చెట్లు కోలుకొని మళ్లీ పచ్చగా మారతాయని చెబుతున్నారు.