News January 26, 2026
టీ20 వరల్డ్‌కప్ సమావేశంలో BCB ఛైర్మన్ అసహనం!

T20 WC విషయంలో ICCతో జరిగిన సమావేశంలో BCB ఛైర్మన్ సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల సాకుతో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ కోరిన విషయం తెలిసిందే. 3 వారాల పాటు చర్చలు సాగినప్పటికీ ఆ ప్రతిపాదనను ICC తిరస్కరించింది. చివరకు బంగ్లాను తప్పించి స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌లో BCB ఛైర్మన్ అమినుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
Similar News
News February 8, 2026
తన పురుషాంగం, తల దాచాలని కోరాడు

సెక్స్ ట్రాఫికర్ ఎప్‌స్టీన్ గురించి పలు విచిత్ర విషయాలూ బయటకొస్తున్నాయి. అందులో ఒకటి.. Cryonics. పిలిచే నిరూపితం కాని ఈ సైన్స్ ప్రక్రియలో మృతదేహాన్ని -195° నుంచి -320° మధ్య ఫ్రీజ్ చేస్తారు. ఆ వ్యక్తికి గల రోగం/సమస్యకు ఫ్యూచర్‌లో సరైన పరిష్కారం దొరికినప్పుడు తిరిగి యాక్టివ్ చేసి చికిత్స చేస్తారు. దీన్ని బాగా నమ్మిన ఎప్‌స్టీన్ తన తల, పురుషాంగం ఫ్రీజ్ చేయాలని సైంటిస్టులకు సూచించాడట.
News February 8, 2026
T20 WC: ఇంగ్లండ్ స్కోర్ 184-7

ముంబై: నేపాల్‌తో జరుగుతున్న మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 184-7 స్కోర్ చేసింది. జాకబ్ బెథెల్ (55), బ్రూక్ (53), విల్ జాక్స్ (39*) రాణించారు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్, నందన్ యాదవ్ చెరో 2 వికెట్లు తీశారు. షేర్ మల్లా, సందీప్ లామిచానే తలో వికెట్ పడగొట్టారు. కరణ్ కేసీ వేసిన చివరి ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. నేపాల్ టార్గెట్ 20 ఓవర్లలో 185 రన్స్.
News February 8, 2026
కేసీఆర్ ఫొటోకు అజహరుద్దీన్ దండం పెట్టాలి: హరీశ్ రావు

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో తాము ప్రశ్నించినందుకే అజహరుద్దీన్‌కు సీఎం రేవంత్ మంత్రి పదవి ఇచ్చారని హరీశ్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ ఫొటోకు అజహరుద్దీన్ దండం పెట్టాలని అన్నారు. ఆయనకు మంత్రి పదవి వచ్చి 3 నెలలైనా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని, ఇంకో 3 నెలల్లో ఇవ్వకపోతే మినిస్టర్ పదవి పోతుందని వ్యాఖ్యానించారు. తనకు వంద నోటీసులు ఇచ్చినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపనని స్పష్టం చేశారు.


