News April 27, 2024
పంత్ ఇంకా ముందు రావాలి: ఆకాశ్ చోప్రా
ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ బ్యాటింగ్ ఆర్డర్లో మరింత ముందుగా రావాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ముంబైతో ఢిల్లీ వాంఖడేలో ఆడిన మ్యాచ్‌లో పంత్ ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చారని చోప్రా గుర్తుచేశారు. ‘చాలా స్వల్ప తేడాతో ఆ మ్యాచ్ ఢిల్లీ ఓడిపోయింది. పంత్ ముందుగా వస్తే మ్యాచులను మలుపు తిప్పగలరు. చివర్లో వస్తే ప్రభావం చూపించే సమయం అతడికి చిక్కడం లేదు’ అని వివరించారు.
Similar News
News November 17, 2024
ట్రంప్ దిగిపోయేవరకూ మా నౌకలో ఉండండి.. సంస్థ ఆఫర్!
అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే దేశం వదిలి వెళ్లిపోతామంటూ USలో చాలామంది ప్రముఖులు ఎన్నికలప్పుడు అన్నారు. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాకు చెందిన ఫార్చూన్ అనే ఓ క్రూయిజ్ షిప్ సంస్థ దీన్ని వ్యాపారావకాశంగా మలచుకుంది. ట్రంప్ పదవీకాలం ముగిసేవరకూ తమ క్రూయిజ్ షిప్లో ప్రపంచమంతా తిరగమని ఆఫర్ ఇచ్చింది. ఏడాదికి 40వేల డాలర్లు చెల్లిస్తే చాలని పేర్కొంది. మరి ఈ ఆఫర్‌ను ఎంతమంది తీసుకుంటారో చూడాలి.
News November 17, 2024
గ్రూప్-3లో సినిమాలపై ప్రశ్నలు.. జవాబులు చెప్పండి చూద్దాం!
1.2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినది ఏది?
A.బ్రహ్మాస్త్ర B.కాంతార C.ముర్ముర్స్ ఆఫ్ ది జంగల్ D.ఆట్టం
2.ఆస్కార్ అవార్డు 2024కి నామినేట్ అయిన డాక్యుమెంటరీ చలనచిత్రం ‘టు కిల్ ఎ టైగర్’ దర్శకుడు ఎవరు?
A.కార్తికి గొన్సాల్వ్స్ B.నిషా పహుజా C.ఆర్.మహదేవన్ D.నిఖిల్ మహాజన్
**సరైన సమాధానాలు సా.5 గంటలకు ఇక్కడే పోస్ట్ చేస్తాం.
News November 17, 2024
అవకతవకలు జరుగుతున్నాయ్: కైలాష్ గహ్లోత్
ఆతిశీ ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆప్‌కు <<14635089>>రాజీనామా<<>> చేసిన కైలాష్ గహ్లోత్ ఆరోపించారు. పార్టీ సవాళ్లు ఎదుర్కొంటోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని పేర్కొన్నారు. ప్రజలపై పార్టీ నిబద్ధతను వ్యక్తిగత రాజకీయ ఆశయాలు అధిగమించాయన్నారు. అధికారిక నివాసానికి భారీగా ఖర్చు చేయడం వంటి అంశాలు సామాన్యులుగా ఉండాలనుకొనే పార్టీ వైఖరిపై అనుమానాలకు తావిస్తోందని తప్పుబట్టారు.