News January 26, 2026

కలెక్షన్ల సునామీ.. ‘బార్డర్-2’కు రూ.120 కోట్లు

image

సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ‘బార్డర్-2’ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నిన్న రూ.54 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టగా ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.120 కోట్లకు పైగా నెట్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇవాళ సెలవు కావడంతో మరో రూ.50 కోట్లు కలెక్ట్ చేసే అవకాశముందని వెల్లడించాయి. అటు ‘ధురంధర్’ మూడు రోజుల్లో రూ.105 కోట్లు కలెక్ట్ చేయడం గమనార్హం.

Similar News

News February 23, 2026

YELLOW ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో APలోని కోస్తా, రాయలసీమల్లో ఇవాళ వానలు కురుస్తాయని IMD తెలిపింది. TGలోని భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సిద్దిపేట, మెదక్ సహా <<19211980>>17 జిల్లాలకు<<>> ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా నిన్న APలోని పోలవరం, రాజవొమ్మంగి, అనకాపల్లిలో భారీ వర్షం కురిసింది. మరోవైపు కర్నూలులో దేశంలోనే అత్యధికంగా 37డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. TGలోని ఆదిలాబాద్‌, నిర్మల్, కామారెడ్డిలో వాన కురిసింది.

News February 23, 2026

జాతకంలో మహాలక్ష్మి రాజయోగం ఎలా ఏర్పడుతుందంటే?

image

జాతకంలో చంద్రుడు, కుజుడు శుభస్థానాల్లో ఉన్నప్పుడు మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఇది ధనాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, సామాజిక గౌరవాన్ని ప్రసాదిస్తుంది. 2, 9, 10, 11 స్థానాల్లో ఈ సంయోగం ఉంటే ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఈ యోగం ఉన్నవారు సవాళ్లు ఎదురైనా విజయాలు సాధిస్తారు. కష్టపడే తత్వం, దైవానుగ్రహం తోడైతే జీవితం అసాధారణంగా మారుతుంది. ధర్మబద్ధమైన కృషి, సద్గుణాలు ఉంటే ఈ ఐశ్వర్య యోగం మరింత ఫలిస్తుంది.

News February 23, 2026

607 పోస్టులు.. అప్లై చేశారా?

image

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌(NLCIL)లో 607 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. ఐటీఐ అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.11,040 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nlcindia.in