News April 27, 2024
పోలింగ్ స్టేషన్ ధ్వంసం.. ఈ నెల 29న రీపోలింగ్

కర్ణాటకలోని హనూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఓ పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇండిగనత్త గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో కనీస సౌకర్యాలు లేవని గ్రామస్థులు అధికారులను నిలదీయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ స్టేషన్‌లోని ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో ఈ నెల 29న ఆ గ్రామంలో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు EC ప్రకటించింది.
Similar News
News January 8, 2026
ప్రణయ్ హత్య.. నిందితుడికి బెయిల్

TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య(2018) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితుడు శ్రవణ్‌కుమార్(అమృత బాబాయ్)కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జీవిత ఖైదును సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్ విచారణ ముగిసే వరకు బెయిల్ ఇవ్వాలని శ్రవణ్ మధ్యంతర పిటిషన్ వేశారు. వాదనలు విన్న ధర్మాసనం అతని వయసు, జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇచ్చింది.
News January 8, 2026
HURLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

హిందుస్థాన్ ఉర్వరిక్& రసాయన్ లిమిటెడ్ (<
News January 8, 2026
విశాఖ తీరంలో మిస్సైల్ టెస్ట్!

AP: విశాఖ తీరం నుంచి మరోసారి మిస్సైల్ టెస్టుకు రక్షణ శాఖ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 12న అర్ధరాత్రి 12 నుంచి 13న 9AM వరకు నోటమ్(నోటీస్ టు ఎయిర్‌మెన్) జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో తీరం వెంట 500 KM పరిధిలో విమాన రాకపోకలపై నిషేధం ఉంటుంది. కాగా డిసెంబర్ 24న కూడా ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి కే-4 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే.


