News January 26, 2026

HYD: డక్కన్‌ను ఏలిన ధీరవనిత

image

<<18954194>>రుద్రమదేవి..<<>>దక్షిణ భారత సింహాసనాన్ని అధిరోహించిన తొలి ధీరవనిత. కాకతీయ వంశంలో కాంతులు చిందించిన మహారాణి. దేవగిరి రాజు మహాదేవుడి దండయాత్రలను ధైర్యసాహసాలతో తిప్పికొట్టిన ధైర్యశాలి. నాయంకర వ్యవస్థను అమలు చేసి చరిత్రలో నిలిచారు. గొలుసుకట్టు చెరువులకు ఆజ్యం పోసి నీటిని ఒడిసిపట్టేలా చేశారు. ఓరుగల్లు కోటకు మెరుగులద్దారు. 8పదుల వయసులో కదన రంగంలోకి దిగి కాయస్త అంబదేవుడితో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు.

Similar News

News February 11, 2026

జలమండలిలో ఇద్దరు ‘డైరెక్టర్లు’!

image

సిటీ పరిధి పెరిగింది.. నీళ్ల కనెక్షన్లు పెరిగాయి. అడ్మినిస్ట్రేషన్ సెట్ చేసేందుకు సర్కారు ఇద్దరు కొత్త బాసులను దింపుతోంది. HMWS&SB సేవలు ORR దాకా విస్తరించడంతో పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం 2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులను మంజూరు చేసింది. జాయింట్/అదనపు సెక్రటరీ క్యాడర్ అధికారులను డెప్యుటేషన్‌పై నియమించనున్నారు. కనెక్షన్లు 14.50 లక్షలకు చేరడంతో 3 స్వతంత్ర విభాగాల ద్వారా మెరుగైన సేవలు అందిస్తారు.

News February 11, 2026

RR: GREAT ఓటేసిన 103 ఏళ్ల రామయ్య

image

మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 103 ఏళ్ల రామయ్య తన ఓటు హక్కును వినియోగించుకుని యువకులకు ఆదర్శంగా నిలిచారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్‌కి చెందిన రామయ్య అదే వార్డులోని పోలింగ్ కేంద్రానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వీల్ ఛైర్‌పై వచ్చి తన వార్డుకు చెందిన తన ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు. ఓటు విలువ ఇప్పటికైన కొందరు తెలుసుకోవాలని సూచించారు.

News February 11, 2026

HYD: మారిన రూపురేఖలు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే!

image

నాడు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ నుంచి జీహెచ్ఎంసీకి నేడు 300 డివిజన్లతో భారీ విస్తరణ వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అప్పుడు సీఎంగా వైఎస్ఆర్ నేడు రేవంత్ రెడ్డి హయాంలో మార్పులు జరిగాయి. ఈ 12 ఏళ్ల కాలంలో మహానగరంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మెట్రో రైలు, బహుళ అంతస్తుల భవనాలు, ఫ్లై ఓవర్లు.. ఇలా అనేకం నగర ప్రతిష్ఠను ఇనుమడింపజేశాయి.