News January 26, 2026

THDCలో 100 అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

image

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా(THDC)100 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ITI, BE, B.Tech, BBA అర్హతగల అభ్యర్థులు జనవరి 31వరకు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తును, డాక్యుమెంట్స్‌ను పోస్ట్ చేయాలి. అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://thdc.co.in

Similar News

News February 9, 2026

అర్ధరాత్రి వింత అనుభవం: సుధా చంద్రన్

image

నటి, డాన్సర్ సుధా చంద్రన్‌ పూనకానికి సంబంధించిన <<18761618>>వీడియో<<>> కొద్ది రోజుల క్రితం వైరల్ అయిన నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. గతంలోనూ తనకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయన్నారు. గుజరాత్‌లో ఓ షూటింగ్ సమయంలో తనపై ఓ శక్తి దాడి చేసినట్లు చెప్పారు. అర్ధరాత్రి గదిలో నిద్రపోతుండగా ఛాతీ బరువుగా అనిపించిందని, చేతులు కదలలేదన్నారు. చివరకు భక్తితో దేవుని నామస్మరణ చేయడంతో ఉపశమనం కలిగిందన్నారు.

జోరుగా ప్రచారం.. ఎవరిదో పీఠం!

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ తరఫున స్వయంగా CM రేవంత్ సహా మంత్రులు బరిలోకి దిగారు. అటు KTR, హరీశ్ రావు, కీలక నేతలు BRS కోసం ఓట్లు అభ్యర్థించారు. BJP నుంచి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా MPలు ప్రచారం చేశారు. ఎల్లుండి 52.43 లక్షల మంది ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ నెల 13న ఫలితాలు వెలువడతాయి.