News January 26, 2026
ఖమ్మం: జిల్లా అభివృద్ధికి ప్రణాళికాబద్ధ చర్యలు: కలెక్టర్ అనుదీప్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకావిష్కరణ చేసిన కలెక్టర్ అనుదీప్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సందేశమిచ్చారు. సన్నవడ్లు పండించిన 39,475 రైతులకు రూ.113.57 కోట్లు బోనస్ జమ, 9.30 లక్షల గ్యాస్ సిలిండర్లకు రూ.26.31 కోట్లు సబ్సిడీ, 2,46,855 గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు చేరవేశామని వెల్లడించారు.
Similar News
News February 4, 2026
ఖమ్మం: ఐదు మున్సిపాలిటీల బరిలో ఎంత మంది అంటే.?

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికల బరిలో మొత్తం 415 మంది అభ్యర్థులు నిలిచారు. ఎదులాపురం మున్సిపాలిటీలో అత్యధికంగా 109 మంది, వైరా 84, మధిర 80, సత్తుపల్లి 72, కల్లూరులో 70 మంది పోటీలు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 46 మంది స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి 41 మంది అభ్యర్థులు ఉన్నారు. 372 మంది ఉపసంహరణ చేసుకున్నారు. తుది జాబితా ఖరారు కావడంతో ప్రచారం ముమ్మరమైంది.
News February 3, 2026
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఖమ్మం కలెక్టర్

వైరా మండలం పాలడుగు ఎంపీపీఎస్‌ను కలెక్టర్ అనుదీప్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న ఈసీఆర్ 2.0 కార్యక్రమ ప్రగతిపై ఉపాధ్యాయులతో సమగ్రంగా రివ్యూ నిర్వహించారు. మొదటి వారం నుంచి పదో వారం వరకు విద్యార్థుల వారీగా సాధించిన పురోగతిని కలెక్టర్ స్వయంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, వారితో కలిసి భోజనం చేశారు.
News February 3, 2026
ఖమ్మం: నేడు చివరి రోజు..

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం మొత్తం 24 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎదులాపురంలో 19, మధిర, వైరాలో రెండేసి, కల్లూరులో ఒకటి చొప్పున ఉపసంహరణలు జరిగాయి. సత్తుపల్లిలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. నేడు ఉపసంహరణకు చివరి రోజు కావడంతో మరిన్ని విత్‌డ్రాలు జరిగే అవకాశం ఉంది.


