News January 26, 2026
హైదరాబాద్: 24 ఏళ్ల తర్వాత చారిత్రక దృశ్యం

హైదరాబాద్ చారిత్రక కోత్వాల్ హౌస్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. కాగా, 2002 తర్వాత తొలిసారిగా నగర పోలీస్ కమిషనర్ కోత్వాల్ హౌస్‌లో జాతీయ జెండాను ఎగురవేయడం విశేషం. ఈ కార్యక్రమం నగరానికి గర్వకారణంగా నిలుస్తోంది.
Similar News
News February 18, 2026
గోల్కొండ గెస్ట్ హౌస్‌లో సామాన్యుడికి ‘నో ఎంట్రీ’

సర్కారు వారి ‘వారసత్వ’ వ్యాపారం ముదిరి పాకాన పడింది. చారిత్రక గోల్కొండ గెస్ట్ హౌస్‌ను సామాన్యులకు దూరం చేస్తూ కేవలం బడా బాబులకే పరిమితం చేసేలా పర్యాటక శాఖ పావులు కదుపుతోంది. ‘బ్యూటిక్ హోటల్స్’ పేరుతో ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్న ఈ ఆస్తులు ఇకపై “ఇన్విటేషన్ ఓన్లీ” క్లబ్బులుగా మారబోతున్నాయి. గండిపేట రిసార్టుల్లో రూమ్ కావాలంటే పైస్థాయి రికమండేషన్ ఉండాల్సిందే అన్నట్లుగా నిబంధనలు మారుస్తున్నారు.
News February 18, 2026
HYD: షాద్‌నగర్ యాక్సిడెంట్‌లో చనిపోయింది వీరే..!

షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద <<19172186>>అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. కాగా, అరుణాచలం నుంచి HYD తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఇన్నోవా క్రిస్టాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుర్కయంజాల్‌కు చెందిన పురుషోత్తం రెడ్డి, మధుసూదన్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘనటపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 18, 2026
FSLలో కొలువులు.. NOTIFICATION వచ్చేసింది..!

TG ఫోరెన్సిక్ ల్యాబ్(FSL) ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు గమనిక. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసుకున్న వారిలో 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను రాతపరీక్షలకు ఎంపిక చేశారు. MAR 5,6,7 తేదీల్లో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పరీక్షలు జరగనున్నాయి. షార్ట్ లిస్ట్ కానివారు రూ.500 ఫీజు చెల్లించి FEB 21వ తేదీ ఉదయం 8గంటల వరకు ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలు తెలపవచ్చు. హాల్ టికెట్ల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.


