News January 26, 2026
గోల్కొండ, చార్మినార్ కట్టడాలకు TOP 10లో చోటు

గోల్కొండ, చార్మినార్ కట్టడాలు భాగ్యనగర పేరును ప్రపంచవ్యాప్తం చేశాయి. వాటి అందాలను చూసేందుకు దేశ, విదేశాల నుంచి వేలాది మంది వస్తుంటారు. దేశంలోని చారిత్రక ప్రాంతాలను చూసేందుకు వచ్చేవారు ఈ రెండింటిని చూడకుండా వెళ్లరు. అందుకే టాప్ 10 ప్రదేశాల్లో గోల్కొండ, చార్మినార్ చోటు సంపాదించుకున్నాయి. గోల్కొండ కోట 6వ స్థానం, చార్మినార్ 10వ స్థానంలో ఉన్నాయి.
Similar News
News February 6, 2026
లోక్‌సభ సోమవారానికి వాయిదా.. కొనసాగుతున్న రాజ్యసభ

లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. నిరసనలు, నినాదాలతోనే 19 గంటల సభా సమయం వృథా అయిందని సభ వాయిదాకు ముందు స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అమెరికా, EU వాణిజ్య ఒప్పందంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభ ప్రారంభమైనప్పటి నుంచి సభ్యులు ప్లకార్డులు పట్టుకొని వెల్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. బడ్జెట్‌పై శుక్రవారం సాధారణ చర్చ జరగాల్సి ఉంది. ఇక, లిస్ట్ ప్రకారం రాజ్యసభలో చర్చలు కొనసాగుతున్నాయి.
News February 6, 2026
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా

TG: పార్టీ ఫిరాయింపు MLAల కేసు విచారణను సుప్రీంకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. MLAల పిటిషన్లపై స్పీకర్ విచారణ జరుపుతున్నారని, 3 వారాల సమయం కావాలని స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనాన్ని కోరారు. 8 మంది MLAల విషయంలో నిర్ణయం తీసుకున్నామని, మరో ఇద్దరిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. 3 వారాల్లో సానుకూల నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ కింద పరిగణిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
News February 6, 2026
కృష్ణా: టిడిపి జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం నేడే

కృష్ణా జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిమ్మకూరు వేదికగా నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిల్లా టిడిపి అధ్యక్షుడిగా నియమితులైన వీరంకి గురుమూర్తి కార్యక్రమంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు, వివిధ హోదాల్లో నియమితులైన కార్యవర్గ సభ్యులు కూడా అదే సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


