News January 26, 2026
భూపాలపల్లి జిల్లాలో 87,134 మంది లబ్ధిదారులు

మహిళా శక్తి ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నట్లు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సమ్మక్క సారక్క మహిళా జిల్లా సమాఖ్యలో 87,134 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. బ్యాంకు లింకేజి ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో రూ.240 కోట్లకు పైగా రుణాలు అందించమని. అదే విదంగా మహిళాలకు 1,17,220 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
Similar News
News February 10, 2026
VZM: పాము కాటుతో వ్యక్తి మృతి

సంతకవిటి మండలం సిరిపురం పంచాయతీ యాగాటిపేటకి చెందిన రైతు సిరి ఆనందరావు (50) పాము కాటుకు గురై మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఆనందరావు సోమవారం తన పొలంలో మినప చేనును ఇంటికి తీసుకువస్తుండగా దారిలో పాము కాటేసింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలియజేయగా వారు 108కు సమాచారం ఇవ్వడంతో పొందూరు ప్రభుత్వ ఆసుపత్రి లో చేర్చారు. మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
News February 10, 2026
బోయర్ జాతి మేకల ప్రత్యేకతలు ఇవే..

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తి, మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా తెల్లటి శరీరం, ఎర్రటి-గోధుమ రంగు తల, పొడవైన వంగి ఉండే చెవులు, వెనుకకు వంగిన బలమైన కొమ్ములు, పొట్టి కాళ్లు ఉంటాయి. మగ మేకలు ఏడాదిలో 70-80KGలు, రెండేళ్లలో 100KGలకుపైగా పెరుగుతాయి. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని, అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. మనదేశంలో చాలా మంది రైతులు వీటిని పెంచుతున్నారు.
News February 10, 2026
ఉపవాసం ఎందుకు ఉండాలి?

ఉపవాసం అంటే ఆహారం మానడం కాదు. మనస్సును దైవచింతనలో నిలపడం. సంకల్పించిన దేవతకు రోజును అంకితం చేయడం. ధ్యానం, పూజలు, మహిమల పఠనంలో గడపాలి. సహనంగా ఉండాలి. జంతువుల పట్ల దయ చూపాలి. శరీరం, మనస్సును శుద్ధిగా ఉంచాలి. శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. మాటలు, ఆలోచనలలో క్రూరత్వం, దురాశ వీడాలి. నిస్వార్థ పనులు చేయాలి. ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచాలి. వీలైతే మౌనంగా ఉండాలి.


