News January 26, 2026
RGM: ఎన్నికల వేడి.. నామినేషన్ల ముందే ప్రచారం జోరు

పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాకముందే పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు తమ డివిజన్‌లో ప్రచారం ముమ్మరం చేశారు. వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రజలను కలిసి ప్రజా సమస్యలపై అవగాహన కల్పించి, తమను గెలిపించాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలుకాకముందే రామగుండంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
Similar News
News February 4, 2026
గాజువాకలో రైలు కింద పడి ఇంజనీర్ ఆత్మహత్య

గాజువాకలోని ఓ షిప్పింగ్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా.. ఇవాళ ఉదయం సూసైడ్ లెటర్ రాసి ఇంటి నుంచి హర్షవర్దన్ బయటకు వెళ్లాడు. NTPCకి వెళ్లే మార్గంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడగా ఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించి స్టీల్ ప్లాంట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాజువాకలోని టింపిని స్కూల్ ఉడా కాలనీలో నివాసం ఉంటున్న హర్షవర్దన్‌కు భార్య, పాప ఉన్నారు.
News February 4, 2026
ధర్మపురి మున్సిపల్ సమరం.. BRS హోరాహోరీ

ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి 15 వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టింది. 1వ వార్డులో పేరుమండ్ల ఎల్ల గౌడ్, 2- నక్క రమక్క, 3- మాధ్వాచారి కపిల్, 4- బాకీ చంద్రశేఖర్, 5- చుక్క విజయ, 6- మామిడి శివసాయి, 7- గుర్రాల సుధాకర్, 8- అనంతుల విజయ లక్ష్మి, 9- జెట్టి విజయలక్ష్మి, 10- సంగి సతెమ్మ, 11- అల్లాల వెన్నెల, 12- అనుషా తిరుమండసు, 13- బండారి రంజిత్, 14- సంగి రేఖ, 15- వోడ్నాల ఉమాలక్ష్మి.
News February 4, 2026
అపోహలు వీడండి.. ఆరోగ్యం కాపాడుకోండి!

ప్రారంభ దశలోనే గుర్తిస్తే 90% క్యాన్సర్లను విజయవంతంగా నయం చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. పీచు పదార్థాలు తింటూ రోజూ వ్యాయామం చేస్తే వ్యాధి ముప్పు తగ్గుతుందంటున్నారు. ‘శరీరంలో గడ్డలు, మచ్చలు, దీర్ఘకాలిక మార్పులు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ప్రాథమిక దశలో వ్యాధి నిర్ధారణే మన ప్రాణాలను కాపాడుతుంది’ అని సూచిస్తున్నారు. నేడు వరల్డ్ క్యాన్సర్ డే.


