News January 26, 2026
రేపు అఖిలపక్ష భేటీ

ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష భేటీ నిర్వహిస్తోంది. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆహ్వానం పంపారు. పార్లమెంట్ సమావేశాల్లో సహకరించాలని కేంద్రం కోరనుంది. అలాగే ప్రవేశపెట్టే బిల్లుల వివరాలను విపక్షాలకు ఇవ్వనుంది. కాగా ఈ నెల 28 నుంచి FEB 13 వరకు, MAR 9 నుంచి APR 2 వరకు రెండు విడతల్లో సమావేశాలు జరగనున్నాయి.
Similar News
News February 6, 2026
లోక్‌సభ సోమవారానికి వాయిదా.. కొనసాగుతున్న రాజ్యసభ

లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. నిరసనలు, నినాదాలతోనే 19 గంటల సభా సమయం వృథా అయిందని సభ వాయిదాకు ముందు స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అమెరికా, EU వాణిజ్య ఒప్పందంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభ ప్రారంభమైనప్పటి నుంచి సభ్యులు ప్లకార్డులు పట్టుకొని వెల్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. బడ్జెట్‌పై శుక్రవారం సాధారణ చర్చ జరగాల్సి ఉంది. ఇక, లిస్ట్ ప్రకారం రాజ్యసభలో చర్చలు కొనసాగుతున్నాయి.
News February 6, 2026
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా

TG: పార్టీ ఫిరాయింపు MLAల కేసు విచారణను సుప్రీంకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. MLAల పిటిషన్లపై స్పీకర్ విచారణ జరుపుతున్నారని, 3 వారాల సమయం కావాలని స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనాన్ని కోరారు. 8 మంది MLAల విషయంలో నిర్ణయం తీసుకున్నామని, మరో ఇద్దరిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. 3 వారాల్లో సానుకూల నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ కింద పరిగణిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
News February 6, 2026
కలలు కనకపోవడమూ నేరమే: మోదీ

బయోగ్రఫీలు చదవడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు ప్రధాని మోదీ సూచించారు. ‘ఇతరుల జీవిత కథలు చదివితే స్ఫూర్తి పొందుతాం. ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. పెద్దగా కలలు కనండి. వాటిని సాధించుకోవడానికి బాధ్యతగా పనిచేయండి. టెక్నాలజీని తెలివిగా వాడుకోండి. ముందు తరాలకు లేని ఎన్నో అవకాశాలు నేటి తరానికి టెక్నాలజీ రంగంలో ఉన్నాయి. ఏ కల కనకపోవడమూ నేరమే’ అని పరీక్షా పే చర్చలో చెప్పారు.


