News January 26, 2026
BJPకి రాజీనామా.. మళ్లీ BRSలోకి మాజీ MLA

TG: వర్ధన్నపేట మాజీ MLA ఆరూరి రమేశ్ BJP సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎల్లుండి తిరిగి BRSలో చేరనున్నట్లు ప్రకటించారు. తన అనుచరులతో సమావేశమై బీజేపీని వీడాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వర్ధన్నపేట నుంచి రమేశ్ 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 ఎన్నికల్లో BRS తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2024 మార్చిలో BJPలో చేరారు. తాజాగా BRS ఆహ్వానం మేరకు ఆ పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు.
Similar News
News February 11, 2026
అభిషేక్ రేపు ఆడతారా.. తిలక్ ఏమన్నారంటే?

T20WC: కడుపు సంబంధిత సమస్యతో బాధపడుతున్న అభిషేక్ రేపు నమీబియాతో జరిగే మ్యాచ్‌లో ఆడతారా? లేదా? అన్న సందేహం నెలకొంది. దీనిపై తిలక్ మాట్లాడుతూ.. అభిషేక్ ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. రేపు మ్యాచ్ టైమ్‌కు అతని ఫిట్‌నెస్‌ను బట్టి ప్లేయింగ్ 11లోకి తీసుకోవడంపై నిర్ణయం ఉంటుందన్నారు. మరోవైపు అభిషేక్ గైర్హాజరైతే అతని స్థానంలో సంజూ జట్టులోకి వస్తారని క్రీడావర్గాలు చెబుతున్నాయి.
News February 11, 2026
బాలింతలు ఏం తినాలంటే?

ఒక మహిళ జీవితంలో ఎక్కువ కెలోరీలు అవసరమయ్యేది బాలింత దశలోనే. బిడ్డకు పాలివ్వడం వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ సమయంలో సమతులాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా టిఫిన్, లంచ్, డిన్నర్ మధ్యలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫ్రూటస్, నట్స్ తీసుకోవాలి. మిల్లెట్స్ జావలు, సూప్స్, చికెన్, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వులు, చక్కెర, ఉప్పులున్న ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి.
News February 11, 2026
అసెంబ్లీలో ఆవు కథలు చెప్పొద్దు.. మంత్రులకు CBN హెచ్చరిక

AP: క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. ఆవు కథలు చెప్పొద్దని, సమాధానాలు క్లుప్తంగా, అర్థమయ్యేలా ఉండాలని హితబోధ చేశారు. ఉ.9 గంటల నుంచి మ.2 గంటల వరకు అసెంబ్లీలోనే ఉండాలని, ఎమ్మెల్యేలు ప్రస్తావించే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అటు శ్రీశైలంలో శివస్వాములపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని CM ఆగ్రహం వ్యక్తం చేశారు.


