News January 26, 2026

ఎమ్మెల్సీల 24 గంటల ధర్నాకు తపస్ ఇందూరు మద్దతు

image

ఉపాధ్యాయ, ఉద్యోగులు, విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగుల అన్ని రకాల పెండింగ్ బిల్లుల విడుదల చేయాలని, PRC అమలు కోసం ఎమ్మెల్సీల నిరవధిక సమ్మెకు ఇందూరు తపస్ పూర్తి మద్దతు ప్రకటించింది. టీచర్ ఎమ్మెల్సీలు AVN రెడ్డి, మల్క కొమరయ్య, గ్రాడ్యుయేట్ MLC అంజిరెడ్డి మంగళవారం 24 గంటల నిరవధిక ధర్నాను హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో నిర్వహిస్తున్నారు. ఇందూరు తపస్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News April 20, 2026

నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

image

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News April 20, 2026

బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

image

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.