News January 27, 2026
జనగామ: టీచర్ వినూత్న ఆలోచన.. డ్రెస్సులు పంపిణీ

సంక్రాంతి సెలవులు ముగిసిన వెంటనే విద్యార్థులు పాఠశాలకు తిరిగి వచ్చేలా వారిని ప్రోత్సహించేందుకు ఓ టీచర్ వినూత్న ఆలోచన చేశారు. స్టే.ఘ.మం.శివునిపల్లిలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు బి.సురేందర్ రెడ్డి సంక్రాంతి సెలవులు ముగిసిన మరుసటి రోజే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు డ్రెస్సులు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం రూ.14 వేల విలువైన డ్రస్సులను పంపిణీ చేశారు.
Similar News
News February 15, 2026
ఐదు మున్సిపాలిటీలకు కాంగ్రెస్ విప్‌ల నియామకం

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విప్‌లను నియమించినట్లు డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు.. ఏదులాపురానికి దయాకర్ రెడ్డి, మధిరకు ధనికుమార్, వైరాకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కల్లూరుకు ప్రసాద్ రెడ్డి, సత్తుపల్లికి ఎమ్మెల్యే రాగమయిలను విప్‌లుగా ఖరారు చేశారు.
News February 15, 2026
వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

వేములవాడ పురపాలక సంఘం కార్యాలయ భవనంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌కు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ఏర్పాట్లను ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఆర్డీవో రాదాబాయి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్‌తో కలిసి సమావేశ మందిరంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.
News February 15, 2026
పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్

T20WC: ICC ఈవెంట్లలో పాక్‌పై భారత్ జైత్రయాత్రను కొనసాగించింది. ఫార్మాట్ ఏదైనా, ప్లేస్ మారినా ఫలితం మారదని నిరూపించింది. కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో దాయాదిని 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్‌ను 18 ఓవర్లలో 114 రన్స్‌కే కట్టడి చేసింది. బుమ్రా, అక్షర్, వరుణ్, హార్దిక్ తలో 2 వికెట్లు, కుల్దీప్, తిలక్ చెరో వికెట్ తీశారు. వరుసగా 3 విజయాలతో IND సూపర్-8కి చేరుకుంది.


