News January 27, 2026
నిజామాబాద్: ఇందిరమ్మ ఇండ్లకు రూ.266.94 కోట్లు

నిజామాబాద్ జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇండ్లు లక్ష్యం కాగా 16,919 ఇండ్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అందులో 12,850 మార్కింగ్ పూర్తి అయ్యాయని, 9,865 ఇండ్లు బేస్మెంట్ పూర్తి అయ్యాయన్నారు. రూఫ్ లెవెల్‌కు 6,651 ఇండ్లు, స్లాబ్ లెవెల్‌కు 4,981 ఇండ్లు, 216 ఇండ్లు పూర్తి అయ్యాయన్నారు. ఇందుకోసం రూ.266.94 కోట్లు ఖర్చు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News February 23, 2026
NZB: 30 ఫిర్యాదులను స్వీకరించిన సీపీ

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 30 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని CP చెప్పారు.
News February 23, 2026
NZB: మెడల్స్ సాధించిన సిబ్బందిని అభినందించిన సీపీ

4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026లో మెడల్స్ సాధించిన NZB సిబ్బందిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. వివిధ విభాగాల్లో పాల్గొన్న పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది 4 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 9 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. సీపీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు.
News February 23, 2026
NZB: కలెక్టరేట్ ప్రజావాణికి 107 ఫిర్యాదులు

NZB కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 107 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ZP సీఈఓ సాయాగౌడ్ తదితరులకు విన్నవించి అర్జీలు అందజేశారు. ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.


