News January 27, 2026

రామకృష్ణ తీర్థం ఎక్కడ, ఎలా ఉంటుందంటే..

image

రామకృష్ణ తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 10km దూరంలో ఉంటుంది. దట్టమైన శేషాచల అడవుల మధ్య ఉండే ఈ తీర్థాన్ని పవిత్రంగా కొలుస్తారు. యాత్రికులు ముందుగా తిరుమల నుంచి బస్సు/సొంత వాహనాల్లో పాపవినాశనం చేరుకుంటారు. అక్కడి నుంచి సుమారు 6KM దూరంలో ఈ తీర్థం ఉంటుంది. రాళ్లు, రప్పలు, నీటి వాగుల గుండా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే ఈ పవిత్ర తీర్థం వస్తుంది. ఇది ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా, అతి రమణీయంగా ఉంటుంది.

Similar News

News February 15, 2026

కరీంనగర్ తప్ప కార్పొరేషన్లన్నీ కాంగ్రెస్‌కే!

image

TG: కరీంనగర్ మినహా మిగతా కార్పొరేషన్లన్నీ కాంగ్రెస్‌కే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్‌లో మేయర్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్, MIMకు లైన్ క్లియర్ అయింది. అటు కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్ అధికారాన్ని పంచుకోనున్నాయి. MBNRలో MIMతో కలిపి కాంగ్రెస్ పీఠం దక్కించుకోనుంది. నల్గొండ, రామగుండం, మంచిర్యాలలో హస్తం పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది.

News February 15, 2026

సంతోష్‌కు ‘వర్షం’ లాంటి హిట్: ‘కపుల్ ఫ్రెండ్లీ’పై ప్రభాస్ రివ్యూ!

image

యంగ్ హీరో సంతోష్ శోభన్, మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కపుల్ ఫ్రెండ్లీ’పై రెబల్ స్టార్ ప్రభాస్ తన రివ్యూని షేర్ చేశారు. ఇన్‌స్టా వేదికగా మూవీ టీమ్ మొత్తాన్ని అభినందించారు. సినిమా చాలా బాగుందన్న ఆయన.. సంతోష్-మానస జంట ఆకట్టుకుందన్నారు. డైరెక్టర్ అశ్విన్ వర్క్ అద్భుతమని ప్రశంసించారు. తనకు ‘వర్షం’ ఎలాగో సంతోష్‌కు ‘కపుల్ ఫ్రెండ్లీ’ అలా అంటూ నిర్మాత అజయ్‌ను అభినందించారు.

News February 15, 2026

టమాటాలో కాయ తొలుచు పురుగును ఎలా నివారించాలి?

image

టమాటాను కాయ తొలుచు పురుగు ఆశించి తొలుత లేత ఆకులు, కొమ్మలను తిని తర్వాత కాయలను తొలిచి నాశనం చేస్తుంది. ఈ పురుగుల నివారణకు పొలంలో అక్కడక్కడ ఎర పంటగా బంతి మొక్కలను నాటాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను పెట్టాలి. నాటిన 28, 35 రోజులకు లీటరు నీటికి ఫ్లూబెండమైడ్ 0.3ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువైతే లీటరు నీటికి క్లోరాంట్రనిలిప్రోల్ 0.3ML లేదా స్పైనోసాడ్ 0.4ML కలిపి పిచికారీ చేయాలి.