News April 27, 2024

తగ్గుతున్న ఐఐటీల జోరు?

image

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలనూ ప్లేస్‌మెంట్ల కొరత వెంటాడుతోంది. ఐఐటీ జమ్మూలో 50%, ఐఐటీ పాలక్కడ్‌లో 57% విద్యార్థులు ఇంకా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. ఐఐటీ జమ్మూలో 251 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే 126 మందికే జాబ్ ఆఫర్లు వచ్చాయి. కాగా 2023లో ఇక్కడ ప్లేస్‌మెంట్ దక్కని వారి సంఖ్య 33నే ఉండటం గమనార్హం. పాలక్కడ్‌లో 273 మంది దరఖాస్తు చేసుకుంటే 118 మందే ఎంపికయ్యారు.

Similar News

News January 28, 2026

అమిత్ షాతో పవన్ భేటీ

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తాజా రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలను చర్చించామని ఆయన ట్వీట్ చేశారు. ఉప్పాడ తీరంలో గోడ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. తన ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులనూ పవన్ కలిశారు. కాసేపట్లో విశాఖకు బయల్దేరనున్నారు.

News January 28, 2026

అయ్యర్ ఏం పాపం చేశాడు.. గంభీర్‌పై విమర్శలు

image

NZతో నాలుగో టీ20 మ్యాచులో టీమ్ ఇండియా ప్లేయింగ్-11పై విమర్శలు వస్తున్నాయి. ఇషాన్ కిషన్ దూరమైతే అతడి స్థానంలో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కాకుండా బౌలర్ (అర్ష్‌దీప్ సింగ్)ను తీసుకోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయ్యర్ 3, 4 స్థానాల్లో అద్భుతంగా ఆడగలడని, ఎందుకు ఎంపిక చేయలేదని నిలదీస్తున్నారు. ఐదుగురు ప్రొఫెషనల్ బౌలర్లు జట్టులో ఎందుకని హెడ్ కోచ్ గంభీర్‌ను ప్రశ్నిస్తున్నారు.

News January 28, 2026

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 3 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 3న మిర్యాలగూడ, 4న జగిత్యాల, 5న చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌లో ప్రచారం చేయనున్నారు. కాగా ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది.