News January 27, 2026
ఇకపై 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: TGPSC

TG: ఈ ఏడాది నుంచి ఉద్యోగ నియామకాల్లో ఫలితాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండబోదని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చాక సింగిల్ స్టేజ్ పరీక్షలు 3 నెలల్లో, మల్టీ స్టేజ్ పరీక్షలను 6 నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. ఉద్యోగ నియామకాల్లో టైం లైన్స్ పాటిస్తామని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న రిక్రూట్‌మెంట్లను పూర్తి చేశామని చెప్పారు.
Similar News
News February 18, 2026
రాజ్యసభ ఎన్నికల్లో NDAదే పైచేయి?

మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికలతో ఎగువసభలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. 37 సీట్లకు జరగనున్న ఈ ఎన్నికల్లో NDAకి మరో 6 సీట్లు పెరిగి టోటల్ ట్యాలీ 21కు చేరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇండియా కూటమికి 4 సీట్లు తగ్గి విన్నింగ్ సీట్స్ 15కు పరిమితమయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల అంచనా. ఇక TG, హరియాణా, హిమాచల్‌లో కాంగ్రెస్ స్థానాలు పెరగొచ్చు.
News February 18, 2026
ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే భూముల్ని వెనక్కి తీసుకోండి: CBN

AP: GOVT ఆమోదించిన ప్రాజెక్టులు త్వరగా ఏర్పాటవ్వాలని సీఎం CBN SIPB భేటీలో అధికారులను ఆదేశించారు. ‘గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, BPCL వంటి మెగా ప్రాజెక్టులు ఏర్పాటు కావాలి. భూముల కేటాయింపులపైన ఇతరులతో మాట్లాడాలి. ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే ఆ భూముల్ని తీసుకోండి. సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలిస్తాం’ అని చెప్పారు. కాగా ₹29,021 కోట్లతో 22,407 ఉద్యోగాలిచ్చే 27 ప్రాజెక్టులను ఆమోదించారు.
News February 18, 2026
ఇరాన్‌పై త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్ దాడి?

అమెరికా ఇరాన్‌పై త్వరలోనే భారీ మిలిటరీ ఆపరేషన్ లాంచ్ చేయనున్నట్లు రిపోర్ట్స్ రావడం కలకలం రేపుతోంది. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు విఫలమైతే దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని ఆక్సియాస్ ఏజెన్సీ రిపోర్ట్ వెల్లడించింది. అదే జరిగితే ఆ ఆపరేషన్ కొన్ని వారాల పాటు కొనసాగుతుందని అంచనా వేసింది. న్యూక్లియర్, మిసైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరే లక్ష్యంగా ఇజ్రాయెల్‌తో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టనున్నట్లు తెలిపింది.


