News January 27, 2026

నల్గొండలో రూ.8 కోట్లతో స్కూల్ నిర్మాణం.. నేడే ప్రారంభం

image

కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సుమారు రూ.8 కోట్లతో నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల అత్యాధునిక భవనాన్ని మంత్రి వెంకటరెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఇక్కడ రాష్ట్రంలోనే తొలిసారిగా ‘వాల్డార్ఫ్’ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారు. డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్స్, లిఫ్ట్ సౌకర్యం వంటి కార్పొరేట్ స్థాయి వసతులు ఇక్కడ ఉన్నాయి. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందే విధంగా విద్యాబోధన చేయనున్నారు.

Similar News

News February 11, 2026

యనమదుర్రు పెట్రోల్ బంక్‌లో జేసీ ఆకస్మిక తనిఖీ

image

యనమదుర్రులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌ను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన నాణ్యత, కొలతలు, ధరల ప్రదర్శనతో పాటు భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని, ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.

News February 11, 2026

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం: సీపీ సునీల్ దత్

image

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సరళిని సీపీ సునీల్ దత్ బుధవారం పర్యటించి పరిశీలించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన.. భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలతో నిఘా ఉంచామన్నారు.

News February 11, 2026

MHBD: మధ్యాహ్నం ఒంటిగంట వరకు 58.87 శాతం పోలింగ్

image

మహబూబాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలో పోలింగ్ కొనసాగుతోంది. ఐదు మున్సిపాలిటీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్‌లో 51.4 శాతం, తొర్రూర్-52.58, కేసముద్రం-65.14, మరిపెడ-66.22, డోర్నకల్-58.87 శాతం కాగా.. మొత్తం 55.54 ఓటింగ్ శాతం నమోదయిందని అధికారులు తెలిపారు. 70918 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించినట్లు వెల్లడించారు.