News April 27, 2024
భారీగా నామినేషన్ల తిరస్కరణ

APలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తైంది. 25 MP స్థానాలకు 686 నామినేషన్లు దాఖలవగా.. 503 నామినేషన్లను ఆమోదించిన అధికారులు 183 తిరస్కరించారు. అటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 3644 నామినేషన్లు దాఖలవగా.. 2705 నామినేషన్లకు ఆమోదం తెలిపి, 939 తిరస్కరించారు. ఎల్లుండి వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే గడువు ఉండగా.. ఆ తర్వాత తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.
Similar News
News January 28, 2026
ఉపవాసం ఉంటున్నారా? ఈ తప్పులు చేయకండి!

ఉపవాసమంటే ఆహారం మానేయడం కాదు. ఆరోగ్యాన్నిచ్చే ఆధ్యాత్మిక క్రతువు. 15 రోజులకోసారే ఉపవాసముండాలి. ఆ సమయంలో అన్నం, బియ్యంతో చేసిన పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. ఉల్లి, వెల్లుల్లి, మాంసం, మద్యానికి దూరముండాలి. లేకపోతే ఇంట్లోకి దరిద్రం వస్తుందని పెద్దలు చెబుతారు. పూజ సమయంలో నలుపు దుస్తులు ధరించకూడదు. ఎవరితోనూ గొడవ పడకూడదు. దుర్భాషలాడకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
News January 28, 2026
విజయనగరం జిల్లాలో మెగా జాబ్ మేళా

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ విజయనగరం జిల్లాలోని శ్రీ చైతన్య డిగ్రీ& పీజీ కాలేజీలో జనవరి 30న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ అర్హత గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. 17 మల్టీ నేషనల్ కంపెనీలు 975 పోస్టులను భర్తీ చేయనున్నాయి.
News January 28, 2026
PHOTOS: వనమంతా జనం.. కిక్కిరిసిన మేడారం

TG: మేడారం మహా జాతర మొదలైంది. ఇవాళ సారలమ్మ, రేపు సమ్మక్క గద్దెలపై కొలువుదీరనున్నారు. లక్షల మంది వన దేవతలను దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. భక్తిశ్రద్ధలతో బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం మొత్తం జనసంద్రంగా మారిపోయింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మంత్రి సీతక్క జాతర ఏర్పాట్లను పరిశీలించారు.


