News January 27, 2026

హాలీవుడ్ బోర్డుపై లోదుస్తులు.. నటిపై క్రిమినల్ కేసులు!

image

లాస్‌ఏంజెలిస్(US)లోని హాలీవుడ్‌ బోర్డుపై లోదుస్తులు వేలాడదీసి నటి సిడ్నీ స్వీనీ వివాదంలో చిక్కుకున్నారు. తన కొత్త బ్రాండ్‌ ప్రమోషన్‌లో భాగంగా బోర్డుపైకి ఎక్కి బ్రాలను దండగా కట్టి వేలాడదీశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో హాలీవుడ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రచారం కోసం చేసిన స్టంట్ స్వీనీకి సమస్యలు తెచ్చిపెట్టింది.

Similar News

News February 14, 2026

తారిఖ్ ప్రమాణస్వీకారం.. మోదీకి ఆహ్వానం?

image

బంగ్లాదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన BNP ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఆ పార్టీ చీఫ్ తారిఖ్ రెహ్మాన్ PMగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి IND ప్రధాని మోదీని ఆహ్వానించాలని ఆ పార్టీ యోచిస్తోంది. ఇదే జరిగితే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో కీలక మలుపుకానుంది. ఇప్పటికే మోదీ సైతం తారిఖ్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా యూనస్ ప్రభుత్వంలో INDతో రిలేషన్స్ దిగజారిన విషయం తెలిసిందే.

News February 14, 2026

తలకిందులుగా ఉండే ఆలయం.. రాణీ కీ వావ్

image

ప్రపంచంలో తలకిందులుగా ఉండే ఏకైక ఆలయం భారతదేశంలో ఉందని మీకు తెలుసా. అదే గుజరాత్‌లోని రాణి కి వావ్ మెట్ల బావి. నీటినే దైవంగా భావించి చాళుక్య రాజవంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్త భీమ్‌దేవ్ జ్ఞాపకార్థం 1063లో నిర్మించింది. ఈ స్టెప్‌వెల్‌ను క్వీన్స్ స్టెప్‌వెల్ అని పిలుస్తారు. 1980లో ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తవ్వకాల్లో బయటపడిన ఈ బావి 2014లో యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ జాబితాలో చేరింది.

News February 14, 2026

ధురంధర్‌లో అక్షయ్ ఖన్నా రోల్ ఆఫర్.. నాగార్జున క్లారిటీ

image

బాక్సాఫీస్ వద్ద రూ.వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ధురంధర్‌లో అక్షయ్ ఖన్నా పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కాగా ఈ పాత్రలో నటించాలని మేకర్స్ తొలుత నాగార్జునను అడిగారని, డేట్స్ అడ్జస్ట్ కాక తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై నాగ్ స్పందిస్తూ ఈ క్యారెక్టర్ గురించి తనకెలాంటి ఆఫర్ రాలేదని క్లారిటీ ఇచ్చారు. అక్షయ్ ఖన్నా నటన అద్భుతమని, అలాంటి పాత్రలో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.