News January 27, 2026

ఇంటర్వ్యూతో ESIC ఫరీదాబాద్‌లో 50 పోస్టులు

image

<>ESIC<<>> మెడికల్ హాస్పిటల్, ఫరీదాబాద్‌ 50 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 28న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS+ MD/MS/MCh/DM/DrNB/FNB అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం రూ.1,48,669 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in

Similar News

News February 20, 2026

అజ్ఞాతంలోకి YCP ఎమ్మెల్సీ అనంతబాబు!

image

AP: YCP MLC అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గన్‌మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండా ఇవాళ శాసనమండలి సమావేశాల నుంచి ఆయన అర్ధాంతరంగా వెళ్లిపోయినట్లు సమాచారం. ఇప్పటికే అనంతబాబు భార్య కోసం పోలీసుల గాలిస్తున్నారు. తమ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో భర్తను ప్రేరేపించడమే కాకుండా అన్ని విధాలా ఆమె సహకరించారని సిట్ పేర్కొంది.

News February 20, 2026

జుట్టు జిడ్డు ఇలా తగ్గిద్దాం..

image

కాలుష్యం, దుమ్మూ తోడై కొందరి జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. దానికోసం ఈ చిట్కాలు.. * షాంపూలో స్పూన్ కలబంద, కాస్త నిమ్మరసం చేర్చి బాగా కలిపి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. * రెండు స్పూన్ల ముల్తానీమట్టికి తగినంత నీరు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. * తలస్నానం చేసిన జుట్టుకు బ్లాక్ టీని పట్టించి ఇరవైనిమిషాల తర్వాత కడిగేయాలి.

News February 20, 2026

జప మాలను మెడలో ధరించవచ్చా?

image

జపానికి వాడే మాలను మెడలో ధరించకూడదని పండితులు సూచిస్తున్నారు. కేవలం జపం కోసమే ప్రత్యేకంగా ఉంచాలని చెబుతున్నారు. జపమాలకు సంబంధించి కొన్ని నియమాలు.. భగవంతుని శక్తిని జాగృతం చేసే జపంలో ఏకాగ్రత ముఖ్యం. జపమాల 108 పూసలతో ఉండటం ఉత్తమం. 54, 27 లేదా 9 పూసలున్న మాలలను కూడా వాడొచ్చు. రుద్రాక్ష, తులసి వంటి పదార్థాలు మంత్ర శక్తిని శరీరంలోకి చేరవేసే వాహకాలుగా పనిచేస్తాయి.