News January 27, 2026

క్రికెట్ ఫ్యాన్స్‌ అలర్ట్: వైజాగ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..

image

విశాఖలో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. స్టేడియం చుట్టూ 11 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు వాహనాలను ఆనందపురం, పెందుర్తి మీదుగా మళ్లిస్తున్నారు. నగరం నుంచి వెళ్లే వాహనాలు హనుమంతవాక, అడవివరం మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. ప్రేక్షకులు నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలపాలన్నారు.

Similar News

News February 8, 2026

అవంతి శ్రీనివాస్ మళ్లీ వైసీపీ గూటికే చేరనున్నారా?

image

విశాఖ జిల్లాలో YCP మాజీ నేతల రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. మాజీమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మళ్లీ ‘ఫ్యాన్’ నీడకే చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీఎంపీ MVV.సత్యనారాయణ యాక్టివ్ కానున్నట్లు సమాచారం. గౌరవం, గుర్తింపు దక్కే చోటకే వెళ్లాలని వీరు భావిస్తున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ నేతల పునరాగమనం జిల్లా రాజకీయాల్లో కీలకం కానుంది.

News February 8, 2026

విశాఖలో కేజీ చికెన్ రూ.244

image

విశాఖలో చికెన్ ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.137, విత్ స్కిన్‌ కేజీ రూ.244, స్కిన్ లెస్ కేజీ రూ.254 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా శోంఠాం కోడి కేజీ రూ.300 పలకగా.. డజన్ గుడ్లు రూ.65కి అమ్ముతున్నారు. మటన్ కేజీ రూ.1000 కాగా.. చేపలు అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఎంవీపీ కాలనీ, అప్పుఘర్‌, ఫిషింగ్ హర్బర్ సముద్రపు చేపల అమ్మకాలతో సందడిగా ఉన్నాయి.

News February 8, 2026

విశాఖలో మోడ్రన్ కియోస్కులు..

image

విశాఖ వీధులకు సరికొత్త అందాన్ని తెచ్చేలా నెల్లూరు తరహాలో జీవీఎంసీ ‘స్మార్ట్ వెండింగ్ జోన్ల’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సెంట్రల్ పార్క్, ఎండాడ, దువ్వాడలలో అత్యాధునిక మాడ్యులర్ కియోస్కులను నిర్మించనున్నారు. వీటికి సోలార్ పవర్, డిజిటల్ పేమెంట్స్, సీసీటీవీ నిఘా వంటి సౌకర్యాలు ఉంటాయి. వీధి వ్యాపారులకు శాశ్వత చిరునామాను కల్పిస్తూ, ట్రాఫిక్ ఇబ్బందులు లేని నగరంగా తీర్చి దిద్దడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.