News January 27, 2026
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై రాకపోకలు నిలిపివేత

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా గత రెండు వారాలుగా వైరా-జంగారెడ్డిగూడెం మధ్య అనుమతి ఇవ్వగా, అతివేగం, పొగమంచు కారణంగా కల్లూరు, వైరా పరిసరాల్లో వరుస ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు భద్రతా కారణాలతో హైవేను మూసివేశారు.
Similar News
News February 15, 2026
అమెరికన్ ప్లేయర్స్‌కు చైనా సీక్రెట్‌గా ₹116 కోట్లు!

USలో పుట్టి చైనా తరఫున ఆడుతున్న స్టార్ స్కీయర్ ‘ఐలీన్ గూ’, మరో ప్లేయర్ ‘జూ యీ’కు డ్రాగన్ దేశం రహస్యంగా 3ఏళ్లలో ₹116 కోట్లు చెల్లించినట్లు WSJ పేర్కొంది. ద్వంద్వ పౌరసత్వంపై విమర్శలు రాకుండా, విదేశీ క్రీడాకారులకు భారీ నిధులు ఇస్తున్నారన్న ప్రజల అసంతృప్తిని తొక్కేయడానికి అధికారులు ఆమె పేరును బడ్జెట్ రికార్డుల నుంచి తొలగించారు. నేషనల్ ప్రెస్టీజ్ కోసమే చైనా ఇంతలా ఖర్చు చేస్తోందనే వాదన వినిపిస్తోంది.
News February 15, 2026
స్వామివారి ఆశీస్సులు ప్రజలు, ప్రభుత్వంపై ఉండాలి: ఆది

శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై, ప్రజా ప్రభుత్వంపై ఉండాలని కోరుకున్నానని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని, వచ్చే వెయ్యేళ్ల వరకు భక్తులకు సౌకర్యావంతంగా ఉండేవిధంగా రాజన్న ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు.
News February 15, 2026
పెరిగిన విశాఖ డెయిరీ పాల ప్యాకెట్ల ధర..

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో రేపటి నుంచి విశాఖ డెయిరీ పాల ప్యాకెట్ల ధరలు పెరిగనున్నాయి. 200ML, 500ML పాల ప్యాకెట్లపై గరిష్ఠంగా ఒక రూపాయి పెంచారు. ఒక లీటరు పాలు ప్యాకెట్ గరిష్ఠంగా రూ.2 పెంచారు. ఈ పెంచిన ధరలు ఫిబ్రవరి 16 నుంచి అమలులోకి రానున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న నిత్యవసరాల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు


