News April 27, 2024
వైసీపీది రియల్ మేనిఫెస్టో: తమ్మినేని

ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో రియల్ మేనిఫెస్టో అని రాష్ట్ర శాసనసభ స్పీకర్, ఆమదాలవలస వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలను కష్టాల నుంచి బయటపడేసే విధంగా జగన్ మేనిఫెస్టో ఉందని, చంద్రబాబు మేనిఫెస్టో అంతా కాపీ పేస్ట్ మాదిరిగా ఉంటుందన్నారు.
Similar News
News March 2, 2026
SKKM: నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక

మార్చి 2న ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగాపై కార్యక్రమంలో, ఆన్‌లైన్‌లో Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి తమ అర్జీల స్థాయిని తెలుసుకోవచ్చు అన్నారు.
News March 1, 2026
SKLM: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్.. ఒకరి మృతి

కోటబొమ్మాళి మండలం వాండ్రాడ వద్ద ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆదివారం కళ్యాణ శ్రీనివాసరావు (48) వాండ్రాడ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు తీవ్ర గాయాలు కాగా నరసన్నపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 1, 2026
రణస్థలం: మామకు తలకొరివి పెట్టిన కోడలు

రణస్థలం కాపువీధికి చెందిన కె.రామప్పడు అనే విశ్రాంత ఉద్యోగి అనారోగ్యంతో మృతిచెందగా శనివారం ఆయన కోడలు ఉమా మామ మృతదేహానికి తలకొరివి పెట్టింది. రామప్పడు భార్య చిన్నమ్మడు, కుమారులు అప్పన్న, రాంబాబు కొన్నాళ్ల క్రితం మృతిచెందగా అనారోగ్యానికి గురైన మామకు అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన స్థానికులను కలచివేసింది.


