News January 27, 2026
సూపర్ పోలీస్‌కి రైల్వే అత్యున్నత పురస్కారం

150 మందికిపైగా పిల్లలను రక్షించిన RPF ఇన్‌స్పెక్టర్ చందనా సిన్హా తాజాగా భారత రైల్వే అత్యున్నత అతి విశిష్ట రైల్ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చందన 2010లో RPFలో చేరారు. 2024లో భారత రైల్వే ఆపరేషన్ లిటిల్ ఏంజిల్స్‌లో భాగమయ్యారు. రైళ్లు, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో తప్పిపోయిన, అక్రమ రవాణాకు సంబంధించి 152మంది, బచ్‌పన్ బచావో సమితితో కలిసి మరో 41మంది పిల్లలను రక్షించారు.
Similar News
News February 14, 2026
అమరావతిలో రూ.57,868 కోట్లతో పనులు: మంత్రి పయ్యావుల

AP: 2026 మార్చి నాటికి అన్న క్యాంటీన్ల సంఖ్యను 275కు పెంచుతామని మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 204 క్యాంటీన్లను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక పేద కుటుంబాలకు 25 లక్షల పట్టాలు/ఇళ్లను అందించి, సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో రూ.57,868 కోట్ల విలువైన 97 పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేశామని వివరించారు.
News February 14, 2026
C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(C-DOT)లో 10 సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech, MSc, ME/MTech, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. స్కిల్/ రాత పరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdot.in.
News February 14, 2026
శివరాత్రికి రాత్రిపూట పూజ ఎందుకు?

పగలు లౌకిక పనులకు, రాత్రి ఆధ్యాత్మిక సాధనకు సంకేతం. శివరాత్రి నాటి లింగోద్భవ కాలం శక్తిమంతమైనది. చీకటి అజ్ఞానానికి ప్రతీక. అయితే శివుడు జ్ఞాన జ్యోతి. రాత్రంతా మేల్కొని చేసే జాగరణ మనలోని తమస్సును తొలగించి పరమాత్మ వైపు నడిపిస్తుంది. మనసు చంద్రునిపై ఆధారపడి ఉంటుంది. నేడు చంద్రుడు క్షీణించి ఉంటాడు. అంటే మనసు అదుపులో ఉంటుంది. ఆ సమయంలో చేసే శివారాధన ఇంద్రియాలను జయించి, శివత్వాన్ని పొందేలా చేస్తుంది.


