News April 27, 2024

BREAKING: ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పులు

image

TG: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది. మే 24 జూన్ 1 వరకు ఉన్న పరీక్షల తేదీలను మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు మార్చింది. మే 27న నల్గొండ-ఖమ్మం-వరంగల్ MLC ఉప ఎన్నిక నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు.

Similar News

News January 15, 2026

APPLY NOW: NALCOలో 110 పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

image

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<>NALCO<<>>)లో 110 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/బీఈ(మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్) అర్హత గలవారు జనవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గేట్ 2025 స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://mudira.nalcoindia.co.in

News January 15, 2026

‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్లు ఇవే!

image

చిరంజీవి కామెడీ, ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. మంగళవారం కంటే బుధవారం వసూళ్లు పెరిగినట్లు Sacnilk తెలిపింది. సోమవారం రిలీజైన ఈ మూవీ మూడు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా రూ.79.60కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు పేర్కొంది. కాగా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రూ.120+కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టినట్లు మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే.

News January 15, 2026

₹2 లక్షలు డిస్కౌంట్.. అయినా కొనేవారు లేరు!

image

ఇండియాలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామనుకున్న టెస్లాకు గట్టి షాకే తగిలింది. గతేడాది దిగుమతి చేసుకున్న 300 మోడల్ Y కార్లలో దాదాపు 100 అమ్ముడవక షెడ్డుకే పరిమితమయ్యాయి. ముందే బుక్ చేసుకున్న వారూ ఇప్పుడు వెనక్కి తగ్గుతుండటంతో మస్క్ కంపెనీ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. స్టాక్‌ను క్లియర్ చేసేందుకు ఏకంగా ₹2 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. భారీ ధరలు, తక్కువ డిమాండ్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది.