News January 27, 2026

APPLY NOW: NITCలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్‌ (<>NITC<<>>) 9 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 6వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 11వరకు దరఖాస్తును rectnf@nitc.ac.in ఈ మెయిల్‌కు సెండ్ చేయాలి. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ), BTech/PGDM/MBA, MCA, BSc(CS, IT) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://nitc.ac.in/

Similar News

News January 27, 2026

‘10-3-2-1-0’ స్లీప్ ఫార్ములా.. ఏంటో తెలుసా?

image

రాత్రిపూట నిద్ర పట్టడం లేదా? అయితే ఈ ‘10-3-2-1-0’ స్లీప్ ఫార్ములా మీ కోసమే. పడుకోవడానికి 10 గంటల ముందు కాఫీ, 3 గంటల ముందు భోజనం/మద్యం, 2 గంటల ముందు పనులు ఆపేయాలి. ఇక గంట ముందు ఫోన్‌ను పక్కన పెట్టి, ఉదయాన్నే 0 సార్లు (అస్సలు) అలారం స్నూజ్ నొక్కకుండా లేవాలి. ఈ టిప్స్ పాటించడం వల్ల మెదడు ప్రశాంతంగా మారి గాఢ నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

News January 27, 2026

సంతోష్ రావును 5గంటలపాటు ప్రశ్నించిన సిట్!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్ విచారణ ముగిసింది. సిట్ అధికారులు ఆయన్ను దాదాపు 5గంటల పాటు విచారించారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్ రావు నియామక నిర్ణయం ఎవరిది అన్న దానిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. అంతకుముందు ఇదే కేసులో కేటీఆర్, హరీశ్ రావును సిట్ విచారించిన విషయం తెలిసిందే.

News January 27, 2026

సింగర్ అర్జిత్ సింగ్ రిటైర్మెంట్.. షాక్‌లో ఫ్యాన్స్!

image

బాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ అర్జిత్ సింగ్ ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్లేబ్యాక్ సింగింగ్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ‘తుమ్ హి హో’, ‘కేసరియా’ వంటి మెలొడీలతో మెప్పించిన ఆయన 2 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ప్రభుత్వం నుంచి పద్మశ్రీ గౌరవాన్నీ పొందారు. సినిమాల్లో ఆయన గొంతు మూగబోతుందన్న వార్త సంగీత ప్రియులను కలచివేస్తోంది. తెలుగులో మనం, ఉయ్యాలా జంపాలా, స్వామి రారా సహా పలు చిత్రాలకు పాడారు.