News January 28, 2026

జగిత్యాల: ప్రాథమిక విద్యాభివృద్ధిపై కలెక్టర్ దృష్టి

image

జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో FLN (Foundational Literacy and Numeracy)పై సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా విద్యార్థుల చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాల ప్రగతిని కలెక్టర్ సమీక్షించారు. పాఠశాల వారీగా డేటా విశ్లేషించి రాబోయే 40 రోజుల్లో విద్యార్థులు కనీస అభ్యసన స్థాయిలు సాధించేలా ఉపాధ్యాయులకు లక్ష్యాలు నిర్దేశించాలని ఆదేశించారు.

Similar News

News February 6, 2026

అవకాశం వచ్చినప్పుడు గెలిచి తీరాల్సిందే: సీఎం

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. మళ్లీ మళ్లీ పోటీ చేసే అవకాశం అందరికీ రాదని, పార్టీ టికెట్ ఇచ్చినపుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు విద్వేషాలు రెచ్చగొడతాయని, మనం చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలని సూచించారు.

News February 6, 2026

బంగ్లాలో ఘర్షణలు.. యూనస్ ఇంటి బయటే..!

image

ఎన్నికలకు 6 రోజుల ముందు బంగ్లాలో ఘర్షణలు చెలరేగాయి. దేశ సలహాదారు యూనస్ నివాసం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నేషనల్ పే స్కేల్ అమలు చేయాలని దేశంలోని ఉద్యోగులు ఢాకాలోని షహీద్ మినార్ నుంచి యూనస్ నివాసానికి ర్యాలీగా వచ్చారు. లోనికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి, వాటర్ క్యానన్స్, టియర్ గ్యాస్, సౌండ్ గ్రనేడ్లు ప్రయోగించారు. ఢాకా అంతటా భారీగా బలగాలను మోహరించారు.

News February 6, 2026

నిజాంసాగర్: 31 కిలోల చేప లభ్యం

image

నిజాంసాగర్ మండలం సుల్తాన్ నగర్‌కు చెందిన మత్స్యకారుడు ఫణికి నిజాంసాగర్ జలాశయంలో శుక్రవారం చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన వలకు ఏకంగా 31 కిలోల బరువైన భారీ బొచ్చ చేప చిక్కింది. ఇంత భారీ చేప దొరకడం చాలా అరుదైన విషయమని మత్స్యకారులు తెలిపారు. ఈ చేపను సమీపంలోని బొగ్గు గుడిసె వద్ద రూ.5,800లకు విక్రయించినట్లు చెప్పారు. భారీ చేప లభించడంతో ఫణితో పాటు గ్రామంలోని మత్స్యకారుల్లో ఆనందం వ్యక్తమైంది.