News April 27, 2024

టెక్కలి: ద్విచక్ర వాహనం ఢీ.. మహిళకు గాయాలు

image

టెక్కలి-రావివలస రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం ఢీకొని మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక బర్మా కాలనీ వద్ద శనివారం రాత్రి వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం బలంగా ఢీకొనడంతో రోడ్డుపైన పడి తీవ్రంగా గాయాపడింది. క్షతగాత్రురాలిని 108లో చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News July 5, 2025

రణస్థలం: ఏడో తరగతి బాలికపై అత్యాచారయత్నం

image

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ విశాఖలోని రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను శుక్రవారం తన గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.

News July 5, 2025

SKLM: ‘SC ఇంటర్ విద్యార్థులకు అకౌంట్లోకి తల్లికి వందనం’

image

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన ఎస్సీ కులాలకు చెందిన విద్యార్థులకు నేరుగా అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు జమ అవుతాయని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుండ్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 -26 విద్యా సంవత్సరంలో కాలేజీలో జాయిన్ అయి, వారి బ్యాంక్ అకౌంటుకు NPCI లింకు చేయాలని పేర్కొన్నారు. బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ లో వ్యక్తిగత ఖాతా ఓపెన్ చేయాలని తెలిపారు.

News July 5, 2025

శ్రీకాకుళం రైల్వే ప్రయాణికులకు శుభవార్త

image

శ్రీకాకుళం రోడ్ పలాస మీదుగా SMVT బెంగుళూరు(SMVB)- నారంగి(NNGE) మధ్య నడుస్తున్న 2 ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు నడిచేలా పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06559 SMVB- NNGE రైలు జులై 8, 15 తేదీలలో, నం.06560 NNGE- SMVB మధ్య నడిచే రైలు జులై 12, 19 తేదీలలో ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయనగరం, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.