News April 27, 2024

మాచారెడ్డిలో రూ.4,98,300 లక్షల నగదు సీజ్

image

మాచారెడ్డి మండలంలో శనివారం అంతర్ జిల్లా ఘన్పూర్ చౌరస్తా చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.4,98,300 లక్షల నగదును పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆ నగదును సీజ్ చేసి సదరు వాహనదారుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆయనతో పాటు ఎస్ఎస్‌టీ మహేందర్, సిబ్బంది ఉన్నారు.

Similar News

News January 12, 2026

నిజామాబాద్: బీసీ స్టడీ సర్కిల్‌కు సొంత భవనం నిర్మించండి

image

నిజామాబాద్‌లోని ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ మంచి ఫలితాలు సాధిస్తుంది. కానీ అద్దె భవనంలో కొనసాగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బీసీ స్టడీ సర్కిల్‌కు సొంతభవనం నిర్మించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్ కోరారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను ఆదివారం వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా మరో రెండు ప్రభుత్వ కాలేజీ హాస్టళ్లను మంజూరు చేయాలని కోరారు.

News January 11, 2026

NZB: అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పేకాట, కోడిపందెలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని CP సాయి చైతన్య హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.

News January 11, 2026

నిజామాబాద్: మందు బాబులపై ఉక్కుపాదం..!

image

NZB జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 5 రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో దొరికిన 232 మందిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రూ. 22.40 లక్షల జరిమానా విధించింది. వీరిలో 6గురికి జైలు శిక్ష పడింది. ‘ఒక్కసారి దొరికితే రూ.10 వేల జరిమానా’ తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం, పండుగ వేళల్లో విందులు చేసుకునే వారు వాహనాలు నడపరాదని పోలీసులు సూచిస్తున్నారు.