News April 27, 2024
పార్లమెంటు ఎన్నికల్లో కారు తుక్కు తుక్కుఅవుతుంది: పొంగులేటి

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు తుక్కు తుక్కుకానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డికి కేవలం కొత్తగూడెం నియోజకవర్గంలోనే లక్ష ఓట్ల మెజారిటీ అందిద్దామని చెప్పారు. గతంలో BRS మాయమాటలు నమ్మి వివిధ పార్టీల నుంచి చేరి అక్కడ ఇమడలేక కాంగ్రెస్లో చేరిన వారందరికీ ఆహ్వానం పలికారు.
Similar News
News April 23, 2025
ఖమ్మం: 5.8 కేజీల గంజాయి చాక్లెట్లు స్వాధీనం

ఖమ్మం జిల్లాలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. ఏదులాపురం మున్సిపాలిటీ గుర్రాలపాడులోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీల నుంచి సుమారు 5.880 కేజీల గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకొని, నిందితుడు బానోత్ హరియాను అరెస్టు చేశారు. నిందితుడు ఒడిశాలో గంజాయి చాక్లెట్లను కొని ఖమ్మం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు గుర్తించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, నరసింహ ఉన్నారు.
News April 23, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} మధిరలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఓపెన్ 10వ తరగతి పరీక్షలు ∆} వైరా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
News April 23, 2025
ఖమ్మం: 28 నుంచి కేయూ సెమిస్టర్ పరీక్షలు

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్, డిగ్రీ (బ్యాక్ లాగ్) మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలను ఈనెల 28 నుంచి నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా కొన్ని కళాశాలలు పరీక్షా ఫీజులు, నామినల్ రోల్స్ అందించని కారణాలతో వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ తెలిపారు. సవరించిన పరీక్షా టైం టేబుల్, ఇతర వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్లో చూడవచ్చన్నారు.