News January 28, 2026
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి సవిత

AP: త్వరలో DSC నోటిఫికేషన్ విడుదల కానుందని మంత్రి సవిత తెలిపారు. BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో BC అభ్యర్థులకు ఉచిత శిక్షణిస్తామని, జిల్లాల వారీగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విజయవాడ గొల్లపూడిలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలోని సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను ఆమె సందర్శించారు. గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా 100 మంది BC అభ్యర్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్ అందజేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News February 19, 2026
ఆ 2 హామీల అమలుపై ఖర్గే, రాహుల్ ఆరా

TG: AICC నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ ఢిల్లీలో ఇవాళ రాష్ట్ర ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. మ్యానిఫెస్టోలోని వృద్ధాప్య పెన్షన్ ₹4000కు పెంపు, మహిళలకు ₹2500 ఆర్థిక సాయం అమలుపై వారు ఆరా తీశారు. పథకాలపై సమీక్షలో వీటిపై అడగగా రాష్ట్ర ఆర్థిక స్థితి, అమలుకు సవాళ్ల గురించి CM రేవంత్ వారికి వివరించారు. బడ్జెట్లో ఈ పథకాలకు నిధుల కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం వివరించినట్లు పార్టీవర్గాలు పేర్కొన్నాయి.
News February 19, 2026
బాలికకు ఫ్లయింగ్ కిస్.. నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష

ఫ్లయింగ్ కిస్‌లు ఇవ్వడమూ లైంగిక వేధింపులేనని ముంబై స్పెషల్ కోర్టు స్పష్టం చేసింది. తొమ్మిదేళ్ల కిందట 16 ఏళ్ల బాలికతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష, ₹3K ఫైన్ విధించింది. 2017లో ఓ ఈవెంట్‌లో 19 ఏళ్ల యువకుడు బాలికకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ట్యూషన్‌కు వెళ్తుంటే వెనక నుంచి పట్టుకొని తన వైపునకు లాగాడు. దీంతో బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో అతనిపై కేసు నమోదవగా తాజాగా తీర్పు వెలువడింది.
News February 19, 2026
BJPని పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలి: అర్వింద్

TG: రాష్ట్రంలో BJPని 20 ఏళ్లుగా కొందరు కోవర్టులు పట్టి పీడిస్తున్నారని నిజామాబాద్ MP అర్వింద్ వ్యాఖ్యానించారు. అలాంటి వారు వెంటనే పార్టీని వీడి వెళ్లాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉత్తర భాగంలో పార్టీ పటిష్ఠంగా ఉందని, దక్షిణ ప్రాంతంలోనే మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నారు. ‘ఎవరి వల్ల ఎవరు భూస్థాపితం అయ్యారో కవితకు తెలియదా? కేసుల వల్లే నిజామాబాద్‌లో BRS కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది’ అని విమర్శించారు.


