News April 27, 2024
MBNRలో 35,NGKLలో 21 నామినేషన్లు ఆమోదం

తెలంగాణలో నామినేషన్ల పరిశీలన తర్వాత 17 లోక్సభ నియోజకవర్గాల్లో 625 నామినేషన్లు ఆమోదించినట్టు ఈసీ అధికారికంగా ప్రకటించింది. మహబూబ్ నగర్ లో7, నాగర్ కర్నూల్ లో13 నామినేషన్లను తిరస్కరించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ వెల్లడించారు. పరిశీలన అనంతరం MBNRలో 35,NGKLలో 21 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించినట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 29న ముగియనుంది.
Similar News
News January 6, 2026
MBNR: ట్రాన్స్జెండర్లకు గుడ్ న్యూస్.. APPLY NOW

జిల్లాలోని ట్రాన్స్జెండర్ల ఆర్థిక పునరావాసం కోసం 100% సబ్సిడీతో కూడిన పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి S.జరీనా బేగం తెలిపారు. జిల్లాకు కేటాయించిన ఒక యూనిట్ కింద ముగ్గురు ట్రాన్స్జెండర్లను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.75 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీలోగా జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News January 6, 2026
MBNR: అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్రం, గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం సబ్జెక్టులు బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఇన్-ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రో కె పద్మావతి తెలిపారు. జనరల్ కేటగిరి అభ్యర్థులకు పిజీలో 55%, SC, ST అభ్యర్థులకు 50% ఉండలన్నారు. నెట్ సెట్, పీహెచ్డీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
News January 6, 2026
ALERT.. చైనా మాంజా.. సమాచారం ఇవ్వండి: MBNR SP

ప్రజల ప్రాణాల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని, చైనా మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా కఠిన చర్యలు చేపడుతున్నట్లు మహబూబ్నగర్ ఎస్పీ జానకి తెలిపారు. ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించి చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా మానేయాలని, ఎవరైనా చైనా మాంజా అమ్ముతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.


