News January 28, 2026
JNTU గైడ్‌లైన్స్‌లో గందరగోళం.. విద్యార్థుల్లో వ్యతిరేకత

Way2Newsలో R&D విభాగంపై వచ్చిన కథనానికి JNTUHలో BOSలో ఆలోచన మొదలైంది. RRM సమావేశాలను బై కాట్ చేసేయోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం ఇవ్వకుండా గైడ్‌లైన్స్ మార్చడంపై వారు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న గైడ్‌లైన్స్ ప్రకారం ముందుకు వెళ్తే విద్యార్థుల్లో వస్తున్న వ్యతిరేకతపై పరిణామాలు ఎలా ఉంటాయని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ గందరగోళానికి వర్సిటీ ఉన్నతాధికారులు ముగింపు పలకాలన్నారు.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.