News April 28, 2024
ఇషాన్ కిషన్‌కు జరిమానా

ముంబై వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు BCCI జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు ఆయనకు ఫైన్ విధించింది. కాగా ఈ సీజన్‌లో ఇషాన్ అంతంతమాత్రంగానే రాణిస్తున్నారు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి 212 రన్స్ చేశారు. అతడి బ్యాట్ నుంచి ఇంకా భారీ ఇన్నింగ్స్ రాలేదు.
Similar News
News February 4, 2026
చిరంజీవి ‘వారసుడు’ కామెంట్లపై విమర్శలు.. ఘాటుగా స్పందించిన లావణ్య

రామ్‌చరణ్‌కు కవలలు పుట్టడంతో చిరంజీవి గతంలో చేసిన ‘వారసుడు’ కామెంట్లపై పలువురు SMలో విమర్శలు చేశారు. దీనిపై మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి ఘాటుగా స్పందించారు. ‘మీ పోస్ట్ అభ్యంతరకరంగా, ఆనందకరమైన క్షణాలను తుడిచిపెట్టేలా ఉంది. కుటుంబంలోని మహిళలు, మనవరాళ్లతో చిరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో మీకు తెలియదు. ఆయన చేసేదాంట్లో చాలామంది 1% కూడా చేయరు. తెలియని వ్యక్తుల గురించి మాట్లాడొద్దు’ అని హితవు పలికారు.
News February 4, 2026
ఇండియన్ ఆర్మీలో JAG ఎంట్రీ స్కీమ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

<
News February 4, 2026
ఘోస్ట్ జాబ్స్ గురించి తెలుసా?

కొన్ని కంపెనీలు కావాలనే లేని జాబ్ ఆఫర్స్‌ను జాబ్ పోర్టల్స్‌లో పోస్ట్ చేస్తుంటాయి. వీటినే ఘోస్ట్ జాబ్స్ అంటారు. వీటికి అప్లై చేసుకుంటే స్పందన కోసం నెలల కొద్దీ వేచి చూడాలి. కంపెనీ యాక్టివ్‌గా ఉందని, గ్రో అవుతోందని ఇన్వెస్టర్లకు, క్లయింట్లకు చూపించడానికి, అభ్యర్థుల లిస్ట్ రెడీ చేసుకోవడానికి ఈ పద్ధతిని ఫాలో అవుతుంటాయి. అయితే ఇవి దీర్ఘకాలంలో కంపెనీలు, ఉద్యోగార్థులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.


