News January 28, 2026
ఫ్లైట్ క్రాష్‌లలో చనిపోయిన ప్రముఖులు.. (2/2)

2004లో BJP ఎన్నికల ప్రచారానికి వెళ్తూ బెంగళూరు హెలికాప్టర్ ప్రమాదంలో నటి సౌందర్య, 2005లో హరియాణా మంత్రి, వ్యాపారవేత్త ఓం ప్రకాశ్ జిందాల్ చనిపోయారు. 2009 SEPTలో ఉమ్మడి AP CM రాజశేఖర్ రెడ్డి నల్లమల పావురాలగుట్టపై హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఇక 2021లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ TNలో హెలికాప్టర్ క్రాష్‌లో, 2025లో ఎయిరిండియా ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని మృతిచెందారు.
Similar News
News February 12, 2026
కొలికపూడిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆగ్రహం?

AP: ఎంపీ కేశినేని చిన్నీపై ఆరోపణలు, ప్రభుత్వంపై పరోక్ష విమర్శలతో తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు నిత్యం <<19095636>>వివాదాల్లో<<>> ఉంటున్నారు. దీంతో అసెంబ్లీ లాబీలో కొలికపూడితో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ భేటీ అయ్యారు. క్రమశిక్షణ దాటితే ఉరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. అనుభవరాహిత్యంతో పొరపాట్లు జరుగుతున్నాయని, సీనియర్లు మార్గనిర్దేశం చేయాలని కొలికపూడి కోరినట్లు తెలుస్తోంది.
News February 12, 2026
సరికొత్త రోల్‌లో మైక్ టైసన్

జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ సరికొత్త రోల్‌లో కనిపించనున్నారు. ట్రంప్ ప్రభుత్వంలో ‘హెల్తీ ఈటింగ్’ అంబాసిడర్‌గా పనిచేయనున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ‘నా సోదరి ఊబకాయంతో 25 ఏళ్లకే మరణించింది. నేను కూడా బాల్యంలో జంక్ ఫుడ్ వల్ల 156KGల బరువుతో ఇబ్బందిపడ్డా. సూసైడ్ చేసుకోవాలనుకున్నా. మంచి ఆరోగ్యం కోసం అల్ట్రా ప్రాసెస్డ్ కాకుండా రియల్ ఫుడ్ తినండి’ అని పిలుపునిచ్చారు.
News February 12, 2026
ఆటిజం ఉన్న పిల్లల్ని ఎలా పెంచాలంటే?

ఆటిజం ఉన్న పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారన్నది వారికి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరు చిన్నారుల్లో సంగీతం, కంప్యూటర్, డ్రాయింగ్ వేయడం వంటి నైపుణ్యాలు ఉంటాయి. అందువల్ల వీరిలో దాగిన నైపుణ్యాల్ని వెలికి తీయటానికి, మరింత సాన బెట్టటానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. అలాగే వీరిలో సమన్వయం, ఏకాగ్రత పెరగటానికి ఆటలు బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు.


