News January 28, 2026
వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నాం: ముర్ము

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్నారు. దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. గత పదేళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామని చెప్పారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని, 10 కోట్ల మందికి LPG కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు.
Similar News
News February 24, 2026
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలో రేపు కూడా అకాల వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, MBNR జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. నిన్నటి నుంచి రాష్ట్రంలోని పలు చోట్ల <<19222449>>వర్షాలు<<>> కురుస్తున్నాయి. దీంతో మామిడి పంటలు దెబ్బతింటున్నాయి.
News February 24, 2026
ఎండు ద్రాక్షతో ఎన్నో లాభాలు

ఎండు ద్రాక్షను నేరుగా తినడం కంటే నీటిలో నానబెట్టి తినడం వల్ల ఎన్నో లాభాలుంటాయంటున్నారు నిపుణులు. ఎండుద్రాక్షలను నానబెట్టినప్పుడు వాటిపై ఉండే పొర మెత్తబడి, లోపల ఉన్న విటమిన్లు, ఖనిజాలు శరీరం సులభంగా గ్రహించేలా మారుతాయంటున్నారు. దీనివల్ల రక్తహీనత తగ్గడం, జీర్ణక్రియ మెరుగవడం, రోగనిరోధక శక్తి, ఎముకల బలం పెరగడంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యం బావుంటుందని చెబుతున్నారు.
News February 24, 2026
మా డోర్లు తెరిచే ఉంటాయి… సమస్యలు చెప్పండి: పొన్నం

TG: ప్రభుత్వంలో RTC విలీనం, ఇతర అంశాలు GOVT పరిశీలనలో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ‘ఆర్థిక పరిస్థితి వల్ల సమస్యలు ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తున్నాం. మీ కుటుంబ సభ్యుడిగా నా ఆఫీసు డోర్స్ ఎల్లవేళలా తెరిచే ఉంటాయి. ఏ సమస్య అయినా చెప్పవచ్చు. అన్నిటినీ చర్చిద్దాం. ఆందోళనలు, నిరసనలు లేకుండా RTCని కాపాడుకుందాం’ అని వివరించారు. కార్మిక సంక్షేమం, సంస్థ పురోగతికి కలిసి పనిచేద్దామని అన్నారు.


