News January 28, 2026

గద్వాల్: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ

image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన తరుణంలో జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గద్వాల పట్టణంలోని మున్సిపాలిటీ నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ అక్కడ జరుగుతున్న నామినేషన్ ప్రక్రియ, మున్సిపల్ కమిషనర్ జానకి రామ్‌తో భద్రతా ఏర్పాట్లపై డీఎస్పీ మొగిలయ్యతో చర్చించారు.

Similar News

News February 8, 2026

ఏలూరు: ప్రాణం తీసిన ఈత సరదా

image

నూజివీడు మండలంలోని దేవరగుంటలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. రుద్రవరం సాంఘిక సంక్షేమ గురుకులంలో 7వ తరగతి చదువుతున్న రాజ్ కుమార్ (12) పాఠశాల సమీపంలోని ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్నేహితులతో సరదాగా వెళ్లి విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. అప్పటివరకు తమతో ఆడుకున్న మిత్రుడు మృత్యువాత పడటంతో తోటి విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు.

News February 8, 2026

తిరుపతి: ‘రేపు జరగబోయే పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు’

image

సోమవారం జరగాల్సిన PGRS కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామ, వార్డు సచివాలయ స్థాయి సిబ్బంది సమీక్షలో పాల్గొననున్నందున రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.సీఎం చంద్రబాబు సచివాలయంలో నిర్వహించే సమీక్షకు జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు వర్చువల్‌గా హాజరవుతున్నందున రద్దు చేసినట్లు తెలిపారు.

News February 8, 2026

బ్రౌన్ షుగర్‌తో ఎన్నో లాభాలు

image

వైట్ షుగర్ కంటే బ్రౌన్ రంగు షుగర్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. బ్రౌన్ షుగర్ తీసుకోవడంవ‌ల్ల జీర్ణ సమస్యలు తొల‌గిపోతాయి. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లను తగ్గించడానికి, కేల‌రీలు త‌క్కువ‌గా ఉండ‌టంవ‌ల్ల బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. అలాగే ఇందులోని విటమిన్ బి6, నియాసిన్, పాంతోతెనిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం కోసం యాంటీ ఏజింగ్ కాంపోనెంట్‏గా పనిచేస్తాయి.