News January 28, 2026
అజిత్ పవార్ మృతిపై మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి

మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందడం తనను ఎంతగానో కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించిన మంత్రి, పరిస్థితిని సమీక్షించేందుకు హుటాహుటిన ప్రమాద స్థలానికి బయలుదేరి వెళ్లారు.
Similar News
News February 20, 2026
ప.గో జిల్లాలో శ్రీకాకుళం వాసి మృతి

ప.గోజిల్లాలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి భవనం నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ బిల్డింగ్‌పై నుంచి జారిపడి మృతి చెందాడు. తాడేపల్లిగూడెంలోని సత్యవతి నగర్ రోడ్డు నంబర్ 13లో ఓ భవనంలో పనులు చేస్తున్న ముగ్గురి కార్మికులపై పరంజా విరిగి పడగా తీవ్ర గాయాలయ్యాయి. తోటివారు ఆసుపత్రికి తరలిస్తుండగా శ్రీకాకుళం(D) ఎచ్చెర్ల వాసి రాము(45) మృతి చెందాడు.
News February 20, 2026
B.Ed సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ B.Ed మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. కాగా ఈ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేశారు. దీనితో కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 24 నుంచి మార్చి 2వ తేదీ వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు జరుగుతాయని తెలిపారు.
News February 20, 2026
శ్రీకాకుళం: కొత్త పంచాయతీలు ఎన్ని ఏర్పడతాయో?

శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల్లో 912 పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో చాలాచోట్ల కొత్త పంచాయతీలు ఏర్పాటు కోసం అధికారులకు ప్రతిపాదనలు పంపారు. కొత్తగా 64 పంచాయతీల ప్రతిపాదనలు అధికారులు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపారు. 35 కొత్త పంచాయతీలు ఏర్పాటుకు కమిషనర్ కార్యాలయం నుంచి ఆమోదం లభించింది. ఇంకా కొత్త పంచాయతీలు ఏర్పాటుపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.


