News January 28, 2026

కడప జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

AP: <>కడప<<>> జిల్లాలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజీ& హాస్పిటల్ 9 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. MDS అర్హత గలవారు ఫిబ్రవరి 9న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పీజీ మెరిట్ స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 44ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.2000, BC, SC, STలకు రూ.1000. నెలకు జీతం రూ.74,750 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in

Similar News

News February 18, 2026

‘హంప్ డే’ గురించి తెలుసా?

image

ఐదు రోజుల పని వారంలో బుధవారం సరిగ్గా మధ్యలో వస్తుంది. దీనిని ‘హంప్ డే’ అని పిలుస్తారు. ఒంటె మూపురం(హంప్)ను ఎక్కి దిగినట్లుగా బుధవారం దాటితే కష్టమైన పని వారం ముగిసి, వీకెండ్ వైపు ప్రయాణం మొదలైనట్లు ఉద్యోగులు భావిస్తారట. 1950లలో అమెరికాలో పుట్టిన ఈ పదం 2013లో ఒక వాణిజ్య ప్రకటన ద్వారా బాగా పాపులర్ అయ్యింది. దీన్ని సగం కష్టం తీరిందనే సంతోషానికి గుర్తుగా పరిగణిస్తారు.

News February 18, 2026

బామర్ లారీ 28 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

<>బామర్<<>> లారీ& కంపెనీ లిమిటెడ్ 28 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు మార్చి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, MBA, BE/BTech, PGDM, BCA/MCA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.balmerlawrie.com

News February 18, 2026

వయో వ్రతం ఎలా చేయాలి?

image

వయో వ్రతం ఫాల్గుణ శుక్ల పక్ష పాడ్యమి నుంచి ద్వాదశి వరకు 12 రోజులు సాగుతుంది. ఈ సమయంలో పాలు మాత్రమే తీసుకుంటారు. అందుకే ‘పయోవ్రతం’ అనే పేరొచ్చిందంటారు. వ్రతంలో భాగంగా సూర్యోదయానికి ముందే స్నానం చేసి, లక్ష్మీనారాయణులను షోడశోపచారాలతో పూజించాలి. బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపై పడుకోవాలి. ద్వాదశి నాడు పూర్ణాహుతితో వ్రతం ముగించాలి. అన్నదానం చేయాలి. నియమ నిష్టలతో చేసే ఈ పూజ అనంత పుణ్యఫలాన్ని ఇస్తుంది.