News January 28, 2026
మేడారం జాతర.. ఈ నెల 30న ములుగు జిల్లాలో సెలవు

TG: మేడారం జాతర సందర్భంగా ఈ నెల 30న ములుగు జిల్లాలో సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. దీనికి బదులు ఫిబ్రవరి 14 (రెండో శనివారం) పనిదినంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అటు రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News February 28, 2026
ధురంధర్-2 చూశా.. అద్భుతంగా ఉంది: యామీ గౌతమ్

రణ్‌వీర్ సింగ్ నటించిన <<19037836>>ధురంధర్-2<<>> సినిమాను చూసినట్లు నటి యామీ గౌతమ్ వెల్లడించారు. ఈ మూవీ కోసం తన భర్త, డైరెక్టర్ ఆదిత్య ధర్ చేసిన వర్క్‌ను చూసి గర్వపడుతున్నట్లు తెలిపారు. ‘ఈ చిత్రం అంచనాలకు మించి ఉంటుంది. ఇది చూసి ఎమోషనల్ అయ్యాను. ఆదిత్య దేశాన్ని, ప్రేక్షకులను ఎంతో ప్రేమిస్తారు. సినిమాను చూసిన ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఇదొక ఇండియన్ మూవీ అని గర్వంగా చెప్పుకుంటారు’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
News February 28, 2026
VIRAL: 5.9 కిలోల బుజ్జి బాహుబలి

న్యూయార్క్‌లోని ఓ జంట బాల భీముడికి జన్మనిచ్చింది. ఇతాకాలోని కాయుగా మెడికల్ సెంటర్‌లో టెర్రికా, షాన్ దంపతులకు ఏకంగా 5.9 కిలోల బరువున్న బాబు పుట్టాడు. ఈ బుజ్జి భీముడికి 6 నెలల పిల్లల దుస్తులు, డైపర్లే సరిపోతున్నాయి. అదే సమయంలో ఆస్పత్రిలో పుట్టిన మరో శిశువు 1.8కేజీలే ఉంది. ఇద్దరినీ పక్కపక్కనే ఉంచి తీసిన ఫొటో నెట్టింట వైరలవుతోంది. అయితే 1955లో ఇటలీలో 9.97kgలతో అత్యంత బరువైన శిశువు జన్మించింది.
News February 28, 2026
ఖమేనీ టార్గెట్‌గా దాడులు!

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేయడమే లక్ష్యంగా <<19260918>>అమెరికా-ఇజ్రాయెల్<<>> దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మిస్సైల్స్ టెహ్రాన్‌లోని ఖమేనీ ఆఫీసులకు, ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోకి దూసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఆయన అప్పటికే సేఫ్ హౌస్‌కు వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. న్యూక్లియర్ డీల్‌కు ఖమేనీనే అడ్డంకి అని పలుమార్లు ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.


