News January 28, 2026
హిమపాతం.. ధర్మశాల స్టేడియం ఇలా మారింది!

మంచు కురవడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల క్రికెట్ స్టేడియం వెండి కొండలా మెరిసిపోతోంది. చుట్టూ ఉన్న ధౌలాధర్ పర్వత శ్రేణులతో పాటు పరిసర ప్రాంతాలనూ మంచు దుప్పటి కప్పేసింది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న ఈ స్టేడియం ప్రపంచంలోనే సుందరమైన మైదానాల్లో ఒకటిగా పేరుగాంచింది. SMలో వైరలవుతున్న అందమైన ఈ ఫొటోలను చూసి ప్రకృతి ప్రేమికులు ఫిదా అవుతున్నారు.
Similar News
News February 21, 2026
ఉగ్రదాడికి ప్లాన్.. ఢిల్లీలో హైఅలర్ట్

దేశ రాజధాని ఢిల్లీలో పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఎర్రకోట సమీపంలోని ఆలయాలే లక్ష్యంగా ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడొచ్చని ఇంటెలిజెన్స్ గుర్తించింది. దీంతో రెడ్ ఫోర్ట్ సహా నగరంలోని రద్దీ ప్రాంతాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు. గతేడాది ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగిన విషయం తెలిసిందే.
News February 21, 2026
క్రిస్ క్యాపిటల్ చేతికి నోవార్టిస్

స్విస్ హెల్త్‌కేర్ దిగ్గజం ‘నోవార్టిస్ ఏజీ’ భారత్‌లో వ్యాపారానికి ఫుల్‌స్టాప్ పెట్టనుంది. నోవార్టిస్ ఇండియా లిమిటెడ్‌లో ఉన్న 70.68% వాటాను క్రిస్ క్యాపిటల్‌కు విక్రయించనుంది. దీని విలువ రూ.1,446 కోట్లు కాగా ఈ ఏడాది చివరి నాటికి డీల్ పూర్తి కానుంది. దీంతో నోవార్టిస్‌లోని 26% వాటా కొనుగోలుకు క్రిస్ క్యాపిటల్ ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. అందుకు షేరుకు రూ.860.64 చొప్పున రూ.552 కోట్లు వెచ్చిస్తోంది.
News February 21, 2026
గర్భసంచి కిందికి ఎందుకు జారుతుందంటే?

మహిళల్లో పెల్విక్ ఫ్లోర్ కండరాలు, స్నాయువులు గర్భశయానికి సపోర్ట్ ఇవ్వనప్పుడు, ఎక్కువగా సాగి, బలహీనమైనప్పుడు గర్భాశయ ప్రోలాప్స్ వస్తుంది. ఈ సమయంలో గర్భాశయం యోనిలోకి ప్రవేశించడం, పొడుచుకు రావడం వల్ల మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెనోపాజ్, ఎక్కువ సాధారణ ప్రసవాలు జరిగితే ఈ సమస్య వస్తుంది. ఈ సమస్యకి ట్రీట్‌మెంట్ అనేది మహిళ సమస్య, ఆమె వయసు, ఇతర కారణాలపై ఆధారపడి ఉంటుంది.


