News January 28, 2026
వర్కింగ్ ఉమెన్ ఇవి పాటించాల్సిందే..

ఉద్యోగం చేసే ప్రతి మహిళా ఉన్నత స్థానానికి ఎదగాలనే కోరుకుంటుంది. అయితే దీనివల్ల కుటుంబానికి కేటాయించే సమయం తగ్గుతుందని గుర్తించాలి. అన్ని పనులను వేగంగా, సంపూర్ణంగా చేయడం నేర్చుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులూ చేయగలరు. కాబట్టి రోజూ కనీసం ఓ గంట వ్యాయామం, యోగాకి కేటాయించాలి. రేపు చేయాల్సిన పనుల జాబితాను ముందే రాసుకుంటే ఏం చేయాలనేదానిపై స్పష్టత వస్తుంది. ఉద్యోగినులకు ఇది చాలా అవసరం.
Similar News
News February 23, 2026
YELLOW ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో APలోని కోస్తా, రాయలసీమల్లో ఇవాళ వానలు కురుస్తాయని IMD తెలిపింది. TGలోని భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సిద్దిపేట, మెదక్ సహా <<19211980>>17 జిల్లాలకు<<>> ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా నిన్న APలోని పోలవరం, రాజవొమ్మంగి, అనకాపల్లిలో భారీ వర్షం కురిసింది. మరోవైపు కర్నూలులో దేశంలోనే అత్యధికంగా 37డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. TGలోని ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డిలో వాన కురిసింది.
News February 23, 2026
జాతకంలో మహాలక్ష్మి రాజయోగం ఎలా ఏర్పడుతుందంటే?

జాతకంలో చంద్రుడు, కుజుడు శుభస్థానాల్లో ఉన్నప్పుడు మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఇది ధనాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, సామాజిక గౌరవాన్ని ప్రసాదిస్తుంది. 2, 9, 10, 11 స్థానాల్లో ఈ సంయోగం ఉంటే ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఈ యోగం ఉన్నవారు సవాళ్లు ఎదురైనా విజయాలు సాధిస్తారు. కష్టపడే తత్వం, దైవానుగ్రహం తోడైతే జీవితం అసాధారణంగా మారుతుంది. ధర్మబద్ధమైన కృషి, సద్గుణాలు ఉంటే ఈ ఐశ్వర్య యోగం మరింత ఫలిస్తుంది.
News February 23, 2026
607 పోస్టులు.. అప్లై చేశారా?

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NLCIL)లో 607 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. ఐటీఐ అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.11,040 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nlcindia.in


