News January 28, 2026
కృష్ణా: పవన్ కళ్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్‌ను ఎంపీ కలిశారు. సుమారు గంటపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టులపై కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు పనులు, నియోజకవర్గ సమస్యలను పవన్ దృష్టికి బాలశౌరి తీసుకెళ్లారు.
Similar News
News February 4, 2026
‘డిసెంబర్ 31 నాటికి బందరు పోర్ట్ తొలి దశ పూర్తి’

బందరు ఓడరేవు తొలి దశలో 4 బెర్తుల నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందని మెగా ఇంజినీరింగ్ లిమిటెడ్ జీఎం తులసీదాసు తెలిపారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చొంగ్ పూ షీన్ నేతృత్వంలోని బృందం ప్రాజెక్ట్ పనులను బుధవాం పరిశీలించింది. 2000 ఎకరాల్లో సాగుతున్న పనుల్లో 1300 మంది కూలీలు పనిచేస్తున్నట్లు వివరించారు.
News February 4, 2026
త్వరలో చల్లపల్లి మండలంలో సీఎం చంద్రబాబు సభ

CM చంద్రబాబు త్వరలో కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలో సభ నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం సభ నిర్వహణకు అనువైన స్థలాల ఎంపికకు జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ మంగళవారం పురిటిగడ్డ జడ్పీ హైస్కూల్, మేకావారిపాలెంలో పీఏసీఎస్ ఛైర్మన్ గుత్తికొండ వంశీకృష్ణ పొలం, చల్లపల్లి రాజా హైస్కూల్ గ్రౌండ్, పాగోలు ఎన్టీఆర్ స్కూల్ గ్రౌండ్ పరిశీలించారు. తేదీ ఖరారు కాగానే స్థలం ఫైనల్ చేస్తామని ఆయన తెలిపారు.
News February 3, 2026
గన్నవరం: విద్యార్థులకు గుడ్ న్యూస్

వ్యవసాయ విద్యనభ్యసించే విద్యార్థులకు శుభవార్త. గన్నవరంలో నూతన ప్రభుత్వ అగ్రికల్చర్ కాలేజీ ప్రారంభానికి సిద్ధమైంది. అత్యాధునిక ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, హాస్టల్ సౌకర్యాలతో ఈ కళాశాలను తీర్చిదిద్దారు. ప్రయోగాత్మక విద్య, పరిశోధనలకు ఇక్కడ పెద్దపీట వేయనున్నారు. ఈ కళాశాల అందుబాటులోకి రావడం వల్ల స్థానిక విద్యార్థులతో పాటు చుట్టుపక్కల జిల్లాల వారికి వ్యవసాయ రంగంలో మెరుగైన అవకాశాలు లభించనున్నాయి.


