News January 28, 2026
RTCలో 40 కోట్ల మంది ఉచిత ప్రయాణం: రాంప్రసాద్ రెడ్డి

AP: ‘స్త్రీ శక్తి’లో ఉచిత బస్సు ప్రయాణం స్త్రీలకు, ట్రాన్స్‌జెండర్లకు ఎంతో మేలు చేస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ‘వారి జీవితాల్లో ఇదో గొప్ప మార్పు. ఇప్పటివరకు వారు 40 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేశారు. మహిళా ప్రయాణికులు 40% నుంచి 63.4%కి పెరిగారు. డిమాండ్‌కు అనుగుణంగా 1,413 అదనపు ట్రిప్పులు, 64,647 అదనపు KM ఆపరేట్ చేస్తున్నాం. సబ్సిడీగా RTCకి ₹1,388 కోట్లు ఇచ్చాం’ అని చెప్పారు.
Similar News
News February 20, 2026
ట్రంప్‌కు BIG SHOCK

అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆయా దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్‌లను కొట్టేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తేల్చిచెప్పింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి టారిఫ్‌ల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. సుంకాలు విధించేందుకు అత్యవసర అధికారాల వినియోగం చట్టవిరుద్ధమని తెలిపింది. సుప్రీం తీర్పుతో US మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
News February 20, 2026
2028 SEP కల్లా ఐకానిక్ టవర్స్ రెడీ: నారాయణ

AP: అమరావతిలో సెక్రటేరియేట్ కోసం నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్‌ను 2028 SEP కల్లా రెడీ చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ‘గతంలో 26,700 మంది ఉద్యోగులకు వీలుగా 52.72 L చ.అ. బిల్ట్ అప్ ఏరియా, 31.71 L చ.అ. కార్పెట్ ఏరియాతో వీటిని డిజైన్ చేశారు. ఇప్పుడు ఉద్యోగులు 39,882 మంది ఉన్నారంటున్నారు. నయా రాయ్‌పుర్, HYD సచివాలయ, సెంట్రల్ విస్టాను పరిశీలించాలని అధికారులకు సూచించాం’ అని సచివాలయంలో చెప్పారు.
News February 20, 2026
TG EDCET-2026 నోటిఫికేషన్ విడుదల

TG: రాష్ట్రంలో రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరేందుకు TG EDCET-2026 నోటిఫికేషన్ రిలీజైంది. కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో CBT విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు అవకాశం ఉంది. మే 12వ తేదీ 2 సెషన్లలో ఎగ్జామ్ ఉంటుంది. కనీసం 50 మార్కులతో బ్యాచ్‌లర్ డిగ్రీ ఉన్నవాళ్లే అప్లై చేసుకునేందుకు అర్హులు.


